Translate

  • Latest News

    8, జనవరి 2018, సోమవారం

    వీడు మగాడ్రా బుజ్జి...

    వీడు మగాడ్రా బుజ్జి... అసలు ఎవడండీ బాబూ వీడు... ఆర్నెల్ల కిందట వరకు ఈ కొద్దిమందికో తప్ప  ఎవరికీ తెలియదే. ఇప్పుడు రాష్ట్రంలో ఆయన పేరు మార్మోగిపోతొంది. పవన్ కళ్యాణ్ అభిమానులన్నట్టు పబ్లిసిటీ కోసమేనా ఇదంతా... వారి మాటల్లోనే చెప్పుకుంటే ప్రజలకోసం నిరంతరం తపించే కళ్యాణ్ బాబుపై కామెంట్లు చేయడం ద్వారా ఈయన పేరు తెచ్చుకోవాలనేనా. ఇంతకూ ఈ సుత్తి అంతా ఎవరి గురించి అంటున్నారా... అదేనండి...పవన్ అభిమానులు సుత్తి మహేష్ అని... ఇంకా నానా బూతులు తిట్టడం లేదూ... బయట కనపడితే చంపేస్తామనడం లేదు... ఆ కట్టి మహేష్ గురించి.. అసలు అష్టా... చెమ్మా సినిమాలో చెప్పినట్టు ఆ మహేష్.. అనే పేరులోనే ఓ వైబ్రేషన్ ఉందా ఏమిటీ. సరే అసలు విషయం మాట్లాడుకుందాం. కోట్లాది అభిమానులున్న పవన్ కళ్యాణ్ ను  విమర్శించడానికి వీడికెన్ని గుండెల్రా బాబూ... వాళ్ళు చంపేస్తామన్నా చిరునవ్వు నవ్వుతాడేమిటి... అందుకే వీడు మగాడ్రా బుజ్జి అని. అంటే ఆడవాళ్లను కించపరచాలని కాదు... అందరికి తెలిసిన సినిమా పేరుతొ చెబితే బాగుంటుంది కదాని చెప్పా.
    నిన్న టి.వి. 9 స్టూడియోలో కట్టి మహేష్ ఉన్నపుడు డాక్టర్ పావని అనే సైక్రియాటిస్టు  ఫోన్ చేసి అడిగే బి.పీ.డి అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, ఇగో.. సూపర్ ఇగో మధ్య తేడా తెలియక ఇలా ప్రవర్తిస్తున్నాడని, ఆయనకు ఈ రోగం ఎక్సట్రీమ్ దశకు చేరుకుందని నా దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ చేస్తానని చెబుతుంటే ఇంగ్లీషులో వాయించేస్తుంటే.. నాకు భలే నవ్వు వచ్చింది. మహేష్ ఆమెతో కూల్ గా నేనూ ఎం.ఏ సైకాలజీ చదివాను.. నాకు ఇగో, సూపర్ ఇగో గురించి తెలుసు. అంటే కాదు నేను ఎం.ఏ సోషయాలజి, ఎం.ఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎం.ఏ ఇంగ్లీష్ లిటరేచర్ కూడా చదివానని ఆమెతో ఇంగ్లీష్ లోనే సమాధానం ఇచ్చేటప్పటికీ వీడు మామూలోడు కాదురా... వీడు మగాడ్రా బుజ్జి.. అనిపించిందన్న మాట. ఆయనం మాటల్లో చెప్పాలంటే..
     సైకియాట్రీ ట్రీట్మెంట్ ముందు  పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇప్పించాలనిపించింది. ఆ తర్వాత అన్ని రంగాల్లో ఒక వైరస్ లా వ్యాపించిన ఈ వ్యాధిగ్రస్తులను గుర్తించి వాలందరికి వెంటనే చికిత్స చేయాలనిపించింది. ఆ వ్యాధిగ్రస్తుల్లో టి.వి 9 సత్య ఉంటాడు...  డాక్టర్ పావని ఉంటుంది....  ఇంకా చాలామంది ఉంటారు. ఎందుకంటే నిన్న సత్య మహేష్ ను ప్రశ్నలు అడిగేటప్పుడు సత్య బాడీ లాంగ్వేజ్ గమనిస్తే కళ్ళు పెద్దవి చేసి, వేలు చూపిస్తూ ఎక్కడ దొరుకుతాడా మహేష్... ఎలా ఇరికిద్దామా అనే ఉబలాటంతో ఉన్నట్టు కనిపించింది. అయన ఒక్కడే కాదు. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో వందలాది మంది విలేకరులు అందరూ వారు పూనకం వచ్చినట్టు... విలేకరులు లాగా కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానుల్లా అడిగినట్టు కట్టి మహేష్ మీద మూకుమ్మడి దాడి చేసినట్టు ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నిటికి మిస్టర్ కూల్ లా సమాధానం చెప్పాడు మన మహేష్.. 
    ఈ ఎంటైర్ వివాదంలో మహేష్ ను ఎక్కడా తప్పు పట్టలేం కానీ... ఒక్క పూనం కౌర్ విషయంలోనే కొంచెం తొందరపడ్డాడు అనిపించింది. ఆయనకు.. పవన్ కు మధ్య జరుగుతున్న వార్ లో పాపం అనాదిగా ఎందరో మహిళల్లానే ఇప్పడు కూడా ఓ మహిళ బలి పశువు అయిందా అనిపించింది. పవన్ ను బ్లాక్ మెయిల్ చేయడానికి ఆమెను పావుగా వాడుకుంటున్నాడా అనిపించింది.. ఇక్కడ అయన సగటు మగాడిలా వ్యవహిరించారనిపిస్తోంది. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను కట్టి మహేష్ తో విభేదిస్తాను. మిగతా అన్ని విషయాల్లో మహేష్ కె నా ఓటు.. ఎందుకంటే... తరతరాలుగా బానిసత్వంలో మగ్గుతున్న దళిత జాతి ఎదురుతిరిగి ప్రశ్నించడం నేర్చుకుంది.. అంతే  కాదు ప్రశ్నించడం మరిచిపోయిన మిగతా జాతికి కూడా ప్రశ్నించడం నేర్పుతోంది. అందుకే ఇప్పుడు ఒక జిగ్నేష్ మేవాని, ఓ కత్తి మహేష్ లాంటి వారు పుట్టుకొచ్చారు. వారిని అభినందించకుండా ఉండలేం. ఇలాంటి వారు ఇప్పుడు సమాజానికి చాలా అవసరం.
    -మానవేంద్ర 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వీడు మగాడ్రా బుజ్జి... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top