Translate

  • Latest News

    7, జనవరి 2018, ఆదివారం

    చంద్రబాబును ఇరికించిన పాలేకర్


    వ్యవసాయం దండగ అని గతంలో చంద్రబాబు అన్నాడో... లేదో గాని ఆయన అన్నట్టుగా అప్పట్లో ఆ మాటను ప్రతిపక్షాలు నానా యాగీ చేసి ఆయన్ను బదనాం చేసాయి  పాపం. నిజానికి ఆయన ఎప్పుడూ రైతులకు కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులు నేర్పించి వారిని ఆర్ధికంగా బలోపేతం చేయాలనుకుంటారు.. ఆ క్రమంలోనే ఆయన లాభాల నిచ్చే వాణిజ్య పంటలను ప్రోత్సహించారు. ప్రతి నీటిని ఒడిసిపట్టి వృధా కానీయకుండా వాడుకోమన్నారు. ఇంకుడు గుంతలు తవ్వి వాన నీటిని దాచిపెట్టుకోమన్నారు. తుంపర సేద్యాన్ని ప్రోత్సహించారు. ఇప్పుడు ఈ పాలేకర్ గారేదో ప్రకృతి వ్యవసాయం అంటూ కొత్త సంగతులు రైతులకు నేర్పిస్తానంటే ఆయన్ను రప్పించి రాజధానిలో 10 కోట్లు ఖర్చు  పెట్టి మరీ 9 రోజుల పాటు రైతులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. అంతా బాగానే ఉంది... మధ్యలో ఈ పాలేకర్ గారు ఉన్నవాడు ఉన్నట్టు ఉండకుండా ట్రాక్టర్లతో వ్యవసాయం వద్దంటాడు... సేంద్రియ వ్యవసాయం వద్దంటాడు.. అసలు  ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలన్నీ వేస్ట్ ...డబ్బులు దండగ అంటాడు.. దీంతో శిక్షణకు వచ్చిన రైతులంతా అయోమయం... గందరగోళంలో పడిపోయారు.. దీనికి తోడు లాం ఫామ్ వ్యవసాయ శాస్త్రవేత్తలు అందరూ పాలేకర్ వ్యాఖ్యలపై అగ్గి మీద గుగ్గిలమై పోయారు. మేము ప్రత్యామ్నాయ విధానంగా ఆర్గానిక్ (సేంద్రియ) వ్యవసాయాన్ని రైతులకు అలవాటు చేస్తుంటే... ఈయన వచ్చి అది కూడా వద్దు... ప్రక్రుతి వ్యవసాయం అంటాడేమిటి... ఆవు పేడ ... ఆవు మూత్రంతోనే మొత్తం వ్యవసాయం చేసేయమంటున్నాడు.. ఆయన చెప్పే విధానాలేవి  శాస్త్రబద్ధంగా  నిరూపణ అవలేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు.  స్పీకర్ కోడెల కూడా  పాలేకర్ వ్యాఖ్యలను ఖండిస్తూ శాస్ర్తవేత్తలకు మద్దతు ఇచ్చారు. పాలేకర్ చెప్పే విధానం మంచిదీ అయినా ఆయన నోటి దురుసుతనం కొత్త సమస్యలు తెచ్చిపెట్టి పాపం సి.ఎం గారిని ఇరకాటంలో పెట్టేటట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 8 న శిక్షణ ముగింపు సమావేశంలో సి.ఎం చంద్రబాబు పాలేకర్ తోనూ, వ్యవసాయ శాస్త్రవేత్తల తోనూ ముఖాముఖి కార్యక్రమం జరగాల్సి ఉంది. మరి దీనికి సి.ఎం వస్తారో.. లేదో... ముఖాముఖి  జరుగుతుందో.. లేదో.. జరిగితే ఎలా జరుగుతుందనేది వేచి చూడాలి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చంద్రబాబును ఇరికించిన పాలేకర్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top