150 సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఏనాడు కనిపించిన స్టైల్‌లోనే మళ్లీ కనిపించలేదు. ఆరు పదుల వయసొచ్చినా కూడా చిరంజీవిలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. అయితే ప్రస్తుతం మెగాస్టార్ లుక్‌ను చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఖైదీ నంబర్ 150 చిత్రం అయిపోగానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి మొదటి నుంచి వెరైటీ లుక్‌తో కనిపించాడు. ‘సైరా.. నరసింహారెడ్డి’ చిత్రం కోసం కొత్త లుక్‌తో దర్శనమిచ్చాడు. మీసాలు , గడ్డం పెంచి కొత్తగా కనిపించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు తగ్గట్టు సిద్ధమయ్యాడు. కానీ ఇటీవల క్లీన్‌షేవ్‌తో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే సినిమా గ్రాఫిక్స్, త్రీడీ ఇమేజ్ కోసమే చిరంజీవి ఈ విధంగా సిద్ధమైనట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో ‘సైరా…’ చిత్రం రెండో షెడ్యూల్‌ను దర్శకుడు సురేందర్‌రెడ్డి పొల్లాచ్చిలో ప్రారంభించనున్నాడు. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.
చిరంజీవిలో గ్లామర్ తగ్గలేదు.

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి