Translate

  • Latest News

    15, జనవరి 2018, సోమవారం

    జగన్ వెనుక ఉన్న జనం ఎంతమంది . ?


     ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్  చేసుకోవాలని ,తద్వార అధికారం కైవసం చేసుకోవాలని భావించి పాదయాత్ర చేపట్టిన జగన్ కు ప్రజలు తండోపతండాలు వస్తున్నారు. బ్రహ్మరధం పడుతున్నారు. ఇదంతా నిజమే. ....  అనుమానం లేదు. కాని వస్తున్న ప్రజల్లో  తటస్తులు ఉన్నారా..? ఇదే ప్రశ్న జగన్ వ్యూహకర్త పీకే కు వచ్చింది. వెంటనే తన టీమ్ ద్వారా సర్వే చేయించారని సమాచారం.  తరలి వస్తున్న ప్రజల్లో అత్యదిక మంది గతంలో జగన్ కు ఓటువేసిన వారే కావటం విశేషం. ఇక్కడ తన ఓటుబ్యాంకు పదిలంగా ఉందని ఆనందించాలో. లేదా కొత్త ఓటర్లను ఆకర్షించలేకపోవటంపై బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉంది ప్రతిపక్షపార్టీ.  ఈ అంశం అధికార టీడీపీకి ఒకందుకు శుభపరిణామమే. కాని ఇన్ని ప్రజా ఆకర్షక పథకాలు పెడుతున్నా జగన్ వెంట ఉన్న వారిని ఆకర్షించపోవటం ఒకంత బాధకరమైన విషయమే.  మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత ఉందని స్థానిక మంత్రుల, ఎమ్మెల్యేల వలన పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సైతం పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
     జగన్ పార్టీ పాదయాత్ర వలన కొత్తగా కలిసొచ్చిన అంశం ఏదైనా ఉందా.అన్నదే ఆ పార్టీ నాయకులను వేధిస్తున్న సమస్య సుధీర్ఘమైన పాదయాత్రవలన రాష్ట్రంలోని పార్టీ పరిస్థితి మరింత గందరగోళంగా మారిందని వార్తలు వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్యాడర్ ను దిశ నిర్దేశం చేసి కార్యోన్ముఖుల్ని చేయాల్సిన పరిస్థితుల్లో పాదయత్రతో తమకు దూరం అయ్యారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట. ఇటీవల  జిల్లా స్థాయి పదవులను తొలగించి పార్లమెంటరీ పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించటంతో కొత్త మార్పు ఏమిలేదు. ఈ విధంగా ఉంటే ప్రజలకు మరింత దగ్గరగా వెళ్లవచ్చన్న ఆలోచనవలన పెద్దగా ఒనగూరింది ఏమిలేదు. పార్టీ ప్రకటించిన నవరత్నాలు  ,పల్లె నిద్ర కార్యక్రమాలను సైతం నాయకులు దుమ్మా కొట్టేసారు. ప్రజావ్యతిరేకతను సమర్ధవంతంగా క్యాష్ చేసుకోలేకపోవటంతో టీడీపీ ప్రత్యామ్నయం  ప్రజలు పూర్తి స్థాయిలో వైకాపను ప్రస్తుత పరిస్థితిలో అనుకొన్నవిధంగా ఆదరించే పరిస్థితుల్లో లేదన్నది వాస్తవం.

     వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ఎదుర్కొన్న తొలి సార్వత్రిక ఎన్నికలోన్లే వైఎస్సార్ కాంగ్రెస్.. మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. బీజేపీతో జతకట్టిన టీడీపీ జిల్లాలో 46.66 శాతం ఓట్లు సాధిస్తే.. ఒంటరిపోరుతోనే వైఎస్సార్ సీపీ 42.24 శాతం ఓట్లు పొందింది. టీడీపీ-బీజేపీ కూటమికి, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓట్ల వ్యత్యాసం 4.42 శాతం మాత్రమే. బీజేపీ, టీడీపీ కూటమికి 13,74,844 ఓట్లు పోలవగా, వైఎస్సార్ సీపీకి 12,63,828 ఓట్లు వచ్చాయి. టీడీపీ కూటమి, వైఎస్సార్ సీపీకి మధ్య వ్యత్యాసం కేవలం 1,26,316 ఓట్లు మాత్రమే.


     కాని టీడీపీ కి, వైకాపా కు మద్య ఉన్న చిన్నపాటి ఓట్ల వ్యతాసాన్ని తగ్గించుకొనే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా అంటే అదీ లేదు. పీకే వచ్చిన అనంతరం కొంత వ్యూహాలు మార్చినా అది ప్రజల్లోకి ఎక్కటంలేదు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు జీవన్మరణ సమస్య ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచితీరాల్సిన పరిస్థితి. పాదయాత్రలు జరిగిన, జరుగుతున్న జిల్లాలు మినహయించి రాష్ట్రంలో పార్టీ నిస్టేజంగా ఉంది. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా వారికి జగన్ పనికేటాయించకపోవటంతో గోళ్లు గిల్లుకుంటూ న్నారు.  ఇదే పరిస్థితి ఎన్నికల వరకు కొనసాగితే టీడీపీని ఎదుర్కొని గెలవటం కష్టమనే భావన వ్యక్తమౌతుంది. ఇప్పటినుంచి వైకాపా వ్యూహాలకు పదును పెడితే తప్పాఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొవటం కష్టమనే భావన వ్యక్తమౌతుంది.
    ఎడిటోరియల్ డస్క్.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జగన్ వెనుక ఉన్న జనం ఎంతమంది . ? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top