Translate

  • Latest News

    20, జనవరి 2018, శనివారం

    ఇలా అయితే థియేటర్లు మూసుకోవాలసిందే...



    వందల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. ఎంత గొప్ప సినిమా అయినా విడుదలైన రెండో రోజే పైరసీ వచ్చేస్తుంది. ప్రస్తుతం రెండు వారాలు ఆడితే హిట్.. నాలుగు వారాలు ఆడితే సూపర్ హిట్ అన్నట్టయింది మార్కెట్. అందుకే నిర్మాతలు మొదటి రోజు, మొదటి వారం కలెక్షన్స్ మీదే దృష్టి సారిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఓ సినిమా అయితే ఆంధ్రప్రదేశ్ సి.ఎం దగ్గర ప్రత్యేక అనుమతి తీసుకుని మొదటి రోజు  7షోలు వేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ముందే 150 కోట్లు వసూల్  చేయగా, మొదటి రోజే 60 కోట్లు (గ్రాస్)  వసూలు  చేయడం విశేషం. సినిమా ఫలితం ఎలా ఉన్నా మొదటి రోజు, మొదటి వారం లోనే పెట్టిన పెట్టుబడి అంతా లాగేసుకోవాలనే ఆశతో ఇలా చేస్తున్నారు. నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వచ్చేది కాక శాటిలైట్స్ రైట్స్ అమ్ముకోవడం ద్వారా మరికొంత ఆదాయం వస్తుంది. ఇది చాలదన్నట్టు... ఇటీవల అమెజాన్ ప్రైమ్ కు    సినిమా విడుదలైన నెల రోజుల లోపే ప్రదర్శించుకునే హక్కులు అమ్మేసుకుంటున్నారు. కొత్త సినిమా ఇంకా బయట థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శిస్తూ ఉండగానే అమెజాన్ ప్రైమ్ ద్వారా నెటిజన్లు కొత్త కొత్త సినిమాలు చూసేయచ్చు అన్నమాట.. ఆ మధ్య జవాన్ సినిమా ఇలాగే అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్శించారు. తాజాగా ఎం.సి.ఏ సినిమా కూడా విడుదలైన 28 రోజులకే అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్శించారు. ఇది నిర్మాతకు లాభమే కానీ... కోట్లు..కోట్లు పోసి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న వారి పరిస్థితి ఏమిటి. ఇలా అయితే డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది... దియెటర్లు మూసుకోవాలసిందే... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఇలా అయితే థియేటర్లు మూసుకోవాలసిందే... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top