Translate

  • Latest News

    21, జనవరి 2018, ఆదివారం

    పవన్ యాత్ర .. కొన్ని ప్రశ్నలు


    జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయ యాత్రకు ముహుర్తం ఖరారైంది. తన పొలిటికల్ జర్నీని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుండి మాత్రమే ప్రారంభిస్తానని పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ తన ట్విట్టర్‌లో ప్రకటించారు. 2009 ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తున్న సమయంలో  పెను ప్రమాదం నుండి ఆ ఆలయ మహిమ వల్లే బయటపడినట్లు.. అలాగే తన ఇలవేల్పు కూడా ఆంజనేయస్వామి కావడంతో తన రాజకీయ అప్రతిహత యాత్రను కొండగట్టు నుండి ప్రారంభించాలని భావించినట్లు  పవన్ తెలిపారు. సర్వమత ప్రార్ధనల తర్వాత తాను ఇరు రాష్ట్రాల జనాల ఆశీర్వచనాల కోసం వస్తానని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన పెంపొందించుకొనేందుకు తాను ఈ యాత్ర కొనసాగిస్తానని.. ఈ క్రమంలో సామాన్యులను కలుస్తానని.. తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. తన యాత్ర వివరాలను, భావి కార్యాచరణను కొండగట్టులోనే ప్రకటిస్తానని ఆయన ట్విటర్‌లో తెలిపారు. ఈ వ్యాఖ్యలతో పాటు పవన్‌ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఫొటోను కూడా ట్వీట్ చేశారు. 

    మంచిదే ..  అయితే  పవన్ నుంచి ప్రజలు స్పష్టత కోరుకొంటున్నారు . 
    ఏపీలో గ‌త మూడేళ్ల‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తే మ‌న‌కు ప‌వ‌న్ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు వాటి అంతిమ ఫ‌లితాలు ఎవరు పొందుతున్నారో స్పష్టం అవుతుంది 
     నేపథ్యంలో పవన్ తాజాగా చేపడుతున్న యాత్ర కూడా ఆ కోవలోకే వస్తుందా? ఈ పాదయాత్ర లక్ష్యం ఏమిటి?
    జ‌న‌సేన పార్టీ స్ధాపించి నాలుగేళ్ల కావ‌స్తున్నా, పార్టీకి ఇంకా ఒక రూపం ఇవ్వ‌టానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద ప్ర‌య‌త్నం చేసిన‌ట్లుగా లేద‌నే విష‌యం తెల్సిందే. కనీసం రాష్ట్ర్ర స్ధాయిలో కమిటీ నిర్మాణం కూడా చేయలేదు. ఇప్ప‌టికీ జ‌న‌సేన పార్టీకి కేంద్ర బిందువు ప‌వ‌న్ క‌ళ్యాణే. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీల‌కు మ‌ద్ద‌తు ప‌లికిన ఆయ‌న ఏపీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ వైఖ‌రిపై తీవ్రంగా మండిప‌డ్డారు. ఆ పార్టీని టార్గెట్ చేస్తూ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించారు. ఆయ‌న చంద్ర‌బాబుని గ‌ట్టిన ప్ర‌శ్నించిన దాఖ‌లు క‌న్పించ‌వు, పైగా ఆయ‌న ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఎదుర్కొంటున్న త‌రుణంలో స‌డ‌న్‌గా రంగంలోకి దిగ‌టం చేశారు. ఇది అనేక సంద‌ర్బాల్లో స్ప‌ష్టంగా తేలిపోయింది. చంద్ర‌బాబు నాయుడిని ఆదుకునే పాత్ర‌నే ఎక్కువ‌గా పోషించార‌నే విమ‌ర్శ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఉంది. కొన్ని సంద‌ర్బాల్లో ఆయ‌న మాట్లాడిన తీరు, ఆ త‌ర్వాత వాటికి క‌ట్టుబ‌డ‌కుండా వ్య‌వ‌హారిస్తున్న విధానం ప‌రిశీలిస్తుంటే ప‌వ‌న్ వైఖ‌రి స్ప‌ష్టంగా తేలిపోతుంది. గ‌తంలో ప్ర‌తీ జిల్లాలో ఏపీ ప్ర‌త్యేక హోదాపై మీటింగ్ లు అన్నారు. ఆ త‌ర్వాత ఆ ఊసే లేదు. వీటిపై తన యాత్ర ద్వారా  వైఖరి  స్పష్టం చేస్తారని ఆశిస్తూ  ... 
    అంతకు ముందే భిన్నస్వరం లో పవన్ రాక ను స్వగతిస్తు  నిజాయితీతో వస్తే వెల్కమ్ పవన్...(లింక్ http://www.bhinnaswaram.com/2017/12/blog-post_7.html)  కధనం, చూడండి 
    శ్రీహర్ష 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పవన్ యాత్ర .. కొన్ని ప్రశ్నలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top