Translate

  • Latest News

    23, జనవరి 2018, మంగళవారం

    జగన్ బీజేపీతో జత కట్టడం ఖాయమేనా...



    వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఖాయం అనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆయన సూచనప్రాయంగా ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికి మా మద్దతు ఉంటుందని స్పష్టంగా చెప్పారు. జగన్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ ఏడేళ్లలో ఏదయినా ముఖ్యమైన విషయం ప్రజలలోకి సందేశంగా పంపించాలనుకున్న ప్రతిసారి అయన ఇంగ్లీష్ మీడియాను పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే తెలుగు మీడియా దాదాపు 90 శాతం అంతా ఆయనకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి. ఈసారి కూడా సీఎన్ఎన్ న్యూస్ 18 కు ఇంటర్వ్యూ ఇచ్చారని గమనించాలి.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఇప్పటికే అయన ఇండైరెక్ట్ గా మిత్రత్వ వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే.  జగన్, బీజేపీ మధ్య ఇప్పటికే ఒక అవగాహన ఉన్నట్టు కనపడుతోంది. ఆ దిశగానే నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇస్తే  బీజేపీకి మద్దతు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. నిన్న మొన్నటి వరకు జగన్ బీజేపీతో జత కడితే ముస్లింల ఓట్లు దూరమవుతాయనే ఒక భావన ఉండేది. అయితే ఎన్నికల్లో గెలుపే ప్రధానం కాబట్టి గెలుపు కోసం ఒక ఎత్తుగడగా జగన్ బీజేపీతో జత కట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తన వెనుక ఉన్న ముస్లింలకు కూడా ఆమేరకు చెప్పి కన్విన్స్ చేయనున్నారని తెలుస్తోంది.  మరో పక్క బీజేపీలో కూడా సోము వీర్రాజు లాంటి నాయకులు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తును వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఇంటర్వ్యూ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జగన్ బీజేపీతో జత కట్టడం ఖాయమేనా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top