Translate

  • Latest News

    24, జనవరి 2018, బుధవారం

    చస్తానంటేనే గాని పట్టించుకోరా..?


    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ పక్క విదార్థుల ఆత్మహత్యలు... మరో పక్క రైతుల ఆత్మహత్యలు...ఆత్మహత్యాయత్నాలు... వీటికి బాధ్యులెవరు... ఈ ప్రభుత్వంలో  ఆత్మహత్యాయత్నం చేస్తే గాని సమస్యలు పరిష్కారం కావా... పైగా ఇటీవల గుంటూరు జిల్లాలో ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు రైతులు కూడా అధికార తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలే కావడం గమనార్హం. తమ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ  కాళ్లరిగేలా తిరిగినా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విసిగి..వేసారి.. చివరకు గత్యంతరం లేకే ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఆ ఇద్దరు రైతులు స్పష్టంగా చెప్పారు. వీరిలో ఒక రైతు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టి ఆ లోగా తనకు పాస్ పుస్తకం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తూ వీడియో సోషల్ మీడియాలో లీక్ చేసి అధికారులకు ముచ్చెమటలు పోయించాడు. అధికారులు ఉరుకులు..పరుగుల మీద అతని ఊరు వెళ్లి అర్ధరాత్రి వరకు అతని ఇంటి వద్ద కాపలా కాసి.. చివరకు ఆటను అజ్ఞాతం నుంచి రాకపోతే అతని అమ్మకు పాస్ పుస్తకం ఇచ్చి వచ్చారు. మరో రైతు సాక్షాత్తూ కలెక్టర్ గ్రీవెన్స్లో అధికారుల ఎదుటే ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం యావత్ రాష్ట్రాన్నే నివ్వెరపరిచింది. ఈ రెండు సంఘటనలు చాలు...రాష్ట్రంలో పాలన ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికి. రైతుల విషయంలో ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందో చెప్పడానికి.. ఇది చాలా ప్రమాదకర ధోరణి. వీరిని చూసి ప్రేరణ పొంది మరికొంతమంది ఇలాగే ఆత్మహత్యాయత్నాలు చేసే ప్రమాదం ఉంది. ఆ యత్నాలు వికటించి వారి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లితే దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చస్తానంటేనే గాని పట్టించుకోరా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top