Translate

  • Latest News

    26, జనవరి 2018, శుక్రవారం

    పద్మ అవార్డుల్లో తెలుగు వారికి అన్యాయం


    పద్మ అవార్డుల పంపిణీలో తెలుగు వారికి మరోసారి అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కడు కిడాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్) పద్మ అవార్డు పొందారు. మొత్తం 85 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. అందులో ఇళయరాజా తో పాటు మరో ఇద్దరికి దేశంలో రెండో అత్యున్నత అవార్డు అయిన పద్మభూషణ్ ప్రకటించగా, 9 మందికి పద్మభూషణ్, 73 మందికి పద్మశ్రీ లు ప్రకటించారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్ కాకపోయినా... 73 పద్మశ్రీ లలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కడికి ఇవ్వడం నిస్సందేహంగా చిన్న చూపే... మన దగ్గర ప్రతిభకు కొదవ లేదు... ప్రతిభకు సరైన గుర్తింపే లేకుండా పోతోంది. గతంలో కూడా చాలాసార్లు ఇలాగే జరిగింది. రాష్ట్రము విడిపోయాక 2015 లో ఆంధ్రప్రదేశ్ కు  పద్మశ్రీ అవార్డు ఒకే ఒక్కటి నటుడు కోట శ్రీనివాసరావు కు లభించింది. అదీ కోట గతంలో బీజేపీ తరపున ఎం.ఎల్.ఏ గా చేసిఉన్నదున అయిఉండవచ్చు. దీంతో మరుసటి సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల వారు ముందే జాగ్రత్తపడి... కేంద్రంలో వెంకయ్య నాయుడు పలుకుబడి ఉపయోగించి రెండు రాష్ట్రాలకు కలిపి 14పద్మ  అవార్డులు సాధించారు. ఆ ఏడాదే రామోజీరావు కు, యామిని కృష్ణ మూర్తికి  పద్మవిభూషణ్ ,సానియా మీర్జా, సైనా నెహ్వాల్, డాక్టర్ నాగేశ్వరరెడ్డి లకు పద్మభూషణ్, రాజమౌళి,సునీతా కృష్ణన్, లక్ష్మాగౌడ్, డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే తదితరులకు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. 2017 లో కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 8 పద్మ అవార్డులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన త్రిపురనేని హనుమాన్ చౌదరి, విజయవాడకు చెందిన మాంటోస్సొరి కోటేశ్వరమ్మ, చింతకింది మల్లేశం లు ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ సామాజికవర్గానికి చెందిన వారికే ఎక్కువ మందికి ఇప్పించుకున్నారనే విమర్శ వచ్చినప్పటికీ వారంతా అవార్డులకు అర్హులే.. కాకపొతే అంతే అర్హత ఉన్న దళితులూ, ఇతర మైనార్టీలకు చెందిన వారు కూడా ఎందరో ఉన్నా వారిని రికమెండ్ చేసేవారు లేక సమాజంలో అట్టడుగున అణగారిపోయి ఉంటున్నారు. ఏదేమైనా ఈసారి పద్మ అవార్డుల ప్రకటనలో మన తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనడంలో ఎటువంటి అనుమానం లేదు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పద్మ అవార్డుల్లో తెలుగు వారికి అన్యాయం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top