Translate

  • Latest News

    27, జనవరి 2018, శనివారం

    దళిత ప్రోగ్రాంకు కూడా చంద్రన్న పేరేనా..?


    ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార టీడీపీ సరికొత్త దిశగా పావులు కదుపుతొంది . ముందుగా ప్రతిపక్ష పార్టీ ఓటర్లను ఆకర్షించడం, మరో వైపు తన ఓటు బ్యాంకు పదిలంగా చూసుకోవడం.  ప్రతిపక్ష పార్టీ వైకాపా కు దళితులు, ముస్లిం మైనార్టీల మద్దతు ఉంది. వీరిని టార్గెట్ చేస్తే ఎన్నికల్లో గెలుపు సాధ్యం అవుతుందన్న  భావనలో ఉంది .  ఇదే కాన్సెప్ట్ తో టీడీపీ వ్యూహ రచన చేసింది. గతంలో వైకాపా కు చెందిన దళిత నాయకులను పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకుని  అధికార పదవులు కట్టబెట్టారు . తాజాగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత జ్యోతి చంద్రన్న ముందడుగు కార్యక్రమాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను అన్ని విదాధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు.దళితులు సమాజంలో అట్టడుగున నిలవరాదని, అగ్రకుల స్థాయికి వారు ఎదగాలని వక్కాణించారు. వారికి అవసరమైన చేయూత ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చంద్రబాబు చెప్పారు. దళితులను అందరూ ఆదరించాలని కూడా అన్నారు. అంబేడ్కర్‌ ఆశయాల స్పూర్తితో చంద్రన్న ముందడుగు కార్యక్రమం చేపట్టాం అని ఆయన వివరించారు.
    అయితే  టీడీపీ  వారు  గతంలో కాపుల భవనాలకు చంద్రన్న భవనాలు పెట్టే ప్రయత్నం చేసి భంగపడ్డారు.తాజాగా తెలుగుదేశం పార్టీ చేపట్టబోతున్న దళిత జ్యోతి కార్యక్రమానికి కూడా చంద్రన్న పేరే పెట్టడం గమనార్హం.  అంబేడ్కర్‌ ఆశయాల స్పూర్తితో ముందుకు సాగుతామన్న సీఎం ఈ కార్యక్రమానికైనా కనీసం అంబేడ్కర్‌ పేరు పెట్టకపోవడం పై ఆ వర్గాల్లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: దళిత ప్రోగ్రాంకు కూడా చంద్రన్న పేరేనా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top