Translate

  • Latest News

    10, ఫిబ్రవరి 2018, శనివారం

    టీడీపీ సీరియల్ కు డెడ్ లైన్


    రాష్ట్ర రాజకీయాల్లో  దేశ పార్లమెంట్ సాక్షిగా కొనసాగుతున్న టీడీపీ నాటకం తెలుగు టీవీ సీరియల్ ను తలపింప చేస్తున్నాయి . ఇక మీకు ఒక నమస్కారం అంటూ , మిత్రధర్మం పాటిస్తున్నామని  ఒకసారి , నిధులు వచ్చిపడుతున్నాయి అంటూ మరోసారి , చివరి డేడ్ లైన్ అంటూ మరో హెచ్చరిక . ఈ నాటకంలో మీడియా పోషిస్తున్న పాత్రే కీలకం . మొత్తం మీద  ఈ  వారంలో తెలుగు పత్రికలూ, టీవీ లు చూస్తున్న వారు మాత్రం పిచ్చి ఎక్కటం ఖాయం . 
    పార్లమెంట్‌ వాయిదా పడిన తర్వాత జరిగిన ఒక సమావేశంలో విభజన హామీలన్నింటినీ అమలు చేసేందుకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అంగీకరించారంటూ ఆ పార్టీ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. జైట్లీ, అమిత్‌షా, పీయూష్‌ గోయల్, సుజనా చౌదరిలు సమావేశమై, హామీల అమలుకు అంగీకరించినట్లు మీడియాకు విస్తృతంగా లీకులిచ్చింది. ప్రధాని మోదీ గానీ, అరుణ్‌ జైట్లీ రెండుసార్లు పార్లమెంట్‌లో చేసిన తమ ప్రసంగాల్లో గానీ ఎక్కడా విభజన హామీలు అమలు చేస్తామని చెప్పలేదు. జైట్లీ పార్లమెంట్‌లో రెండుసార్లు మాట్లాడినప్పుడు ఇవ్వని హామీలను సభ వాయిదా పడిన తర్వాత జరిగిన సాధారణ సమావేశంలో ఇచ్చేసినట్లు టీడీపీ అనుకూల మీడియాలో ఊదరగొట్టారు విభజన హామీలన్నీ అమలు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని టీడీపీ నేతలు లీకులు వదిలారు. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, పీయూష్‌ గోయల్, అమిత్‌షాలు సుజానా చౌదరితో అత్యవసరంగా సమావేశమై, టీడీపీ చేసిన అన్ని డిమాండ్లను ఒప్పుకున్నట్లు లీకులిచ్చారు. 
    ఇక టీడీపీ మానస పుత్రిక ఆంధ్రజ్యోతి అయితే రెండు ఆకులూ ఎక్కువే చదివింది . ఈ సీరియల్ ముగింపు తేదీ ప్రకటిస్తూ బ్యానర్ ఐటెం వండివార్చింది. కొసమెరుపు ఏమిటంటే ఏపీ కి జరిగిన అన్యాయాన్ని బీజేపీ సీనియర్ నేత అద్వానీ తో మొరపెట్టుకోవడం . ఇది చదువు తుంటే ఒక సామెత గుర్తుకు రావటం లేదా  రోలు వచ్చి రోలు వచ్చి మద్దెలకు చెప్పుకున్నట్లుంది  .. ఇదండీ సంగతి 
    ఎడిటోరియల్ డెస్క్ 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: టీడీపీ సీరియల్ కు డెడ్ లైన్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top