Translate

  • Latest News

    11, ఫిబ్రవరి 2018, ఆదివారం

    వెల్డన్ పవన్ వెల్డన్...


    వెల్డన్ పవన్ వెల్డన్... కేంద్రం విడుదల చేసిన నిధులు.. రాష్ట్రం ఖర్చు పెట్టిన నిధులు.. చేసిన అప్పులు పై శ్వేతపత్రం విడుదల చేయమని అడిగినందుకు పవన్ ను మనసారా అభినదించక తప్పదు. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఎవరు చెప్పేదాంట్లో ఎంతెంత నిజముందో... నిజాల్ని నిగ్గు దీయాలి. ఇందుకోసం పవన్ ఒక నిజ నిర్ధారణ కమిటీ వేస్తాననడం సర్వదా అభినందనీయం. 
    జయప్రకాశ్ నారాయణ్, ఉండవల్లి అరుణకుమార్ లాంటి రాజకీయ మేధావులను ఈ విషయమై ఆయన కలసి చర్చించడం మంచిదే... వీరితో పాటు హరగోపాల్ లాంటి న్యాయవాదులు.. ఏ.బి.కే ప్రసాద్, పొత్తూరి వెంకటేశ్వర రావు లాంటి సీనియర్ జర్నలిస్టులు, రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో నిజనిర్ధారణ కమిటీ వేస్తే బాగుంటుంది. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటె ఈ కమిటీ అడిగిన అన్ని వివరాలు సమర్పించాలి. వాస్తవాలను నగ్నంగా ప్రజల ముందు ఉంచాలి. అప్పుడు ప్రజా కోర్ట్ లో తప్పెవరిదో ప్రజలే తేలుస్తారు. మరి పవన్ కు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వరకు సమాచారం ఇచ్చి సహకరిస్తాయో  వేచి చూడాలి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వెల్డన్ పవన్ వెల్డన్... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top