Translate

  • Latest News

    13, ఫిబ్రవరి 2018, మంగళవారం

    కుడితిలో పడ్డ ఎలుకలా టీడీపీ


     ఇప్పటివరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజి ముద్దు అన్న టీడీపీ అధినాకత్వానికి కేంద్రబడ్జెట్ చుక్కలు చూపించింది. ఇప్పడు టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది.ఇటు మింగలేక,కక్కలేక కొత్త డ్రామాకు తెరతీసింది. స్పష్టంగా రాష్ట్రంపై సవితి తల్లి ప్రేమ చూపిందన్న విషయం తేటతెల్లమైంది. ఇది ఒక్క ఏడాదే జరిగిన మోసం కాదు. ప్రతి ఏడు జరుగుతున్న మోసమే. కాని అప్పడు చంద్రబాబునాయుడుకు మోడికి మంచి సంబంధాలు ఉన్నాయి. అది మిత్రలాభం . కాబట్టి అప్పట్లో అంతా బాగుందనే అభిప్రాయానికి వచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు నోరేత్తారు.. అంటే ఎన్నికలకు సమయం వచ్చేసింది. ఇదే చివరి కేంద్ర బడ్జెట్. సరే రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టినా స్వప్రయోజనాల విషయంలోనూ టీడీపీతో బీజేపీ సంబంధాలు పూర్తిగా క్లైమాక్స్ కు వచ్చేసాయి.

    వద్దు మొర్రో అని ఎంతగా చెప్పినా జగన్తో ప్రధాని మోడీ భేటి అయ్యారు. అలా అని తమతో మాట్లాడుతున్నారా ...అంటే అదీలేదు. ప్రధాని మోడి దర్శనం కోసం ఏడాదిన్నర కాలం ఎదురు చూసిన అనంతరం ఏదో కొన్ని ముచ్చట్లు, ముక్తసరి సమాధానంతో సరిపుచ్చారు. 
    అప్పుడు అసలు డ్రామా మొదలైంది. ఎంపీల వేషాలు, కేంద్రాన్ని విమర్శించిన గల్లా జయదేవకు సన్మానాలు, మంచిదే ఇప్పుడన్నా తేరుకున్నారు అనుకుంటే పొరపాటే. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ, రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ కలిసే ఉన్నాయి. ప్రజల కోసం మాత్రం మీడియా ముందు నాటకాన్ని కట్టిస్తున్నారు. అపరచాణుక్యుడు , మేధావిగా చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు ఎందుకు తప్పులు మీద తప్పులు చేస్తూ ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు. ఏ ప్రయోజనాలు ఆశించి అప్పట్లో ప్రత్యేక హోదా వదులు కున్నారు. సరే రాష్ట్రానికి అవసరమైన ప్యాకేజీ కూడా ఎందుకు సాధించుకోలేకపోయారు. ప్రతిపక్షాలకు చివరకు మిత్రపక్షంలో ఉన్న జనసేనానికి ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నారు అన్న సంశయం మాత్రం ప్రజలను వెన్నానుతునే ఉంది. ఎన్నికలవేళ ఈ ప్రశ్నలకు ప్రజలకు జవాబు కావాలి. డెడ్ లైన్ విధిస్తున్నామని, కేంద్రం స్పందిస్తుందని , మోడీ దిగి వస్తున్నారన్న లీకులతో ప్రజలను సంతృప్తి పరచటం కష్టమన్న విషయం గ్రహించాలి .. చూద్దాం ఏమి జరుగుతుందో ... 
    ఎడిటోయల్ డస్క్

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కుడితిలో పడ్డ ఎలుకలా టీడీపీ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top