Translate

  • Latest News

    15, ఫిబ్రవరి 2018, గురువారం

    తె.దే.పా. వారు అధికారం వదులుకోలేరా..?

    తెలుగుదేశం పార్టీ వారికి అధికారంపై అంత ఆరాటం ఎందుకని... ఏ... వీరు ఎం.పి లతో రాజీనామా చేయిస్తామని ప్రకటించొచ్చు కదా... ప్రత్యేక హోదాపై పోరాటం చేయడానికి అడుగు ముందుకు పడదేం. జగన్ మాట్లాడకపోతే... అదుగో... బి.జె.పీ తో మిలాఖత్ అయ్యాడు అంటారు. ఇప్పడు ఎం.పీ లతో రాజీనామా చేయిస్తామని ప్రకటిస్తే డ్రామా అంటారు... ఆ డ్రామా ఏదో వారే చేసి కేంద్రాన్ని బెదిరించొచ్చు కదా.. ఆ పని ఎందుకు చేయరు? ... మోడీ అంటే భయమా... ఓటుకు నోటు కేసు భయపెడుతోందా... చంద్రబాబు మీటింగులు మీద మీటింగులు పెడుతున్నారు కానీ... కేంద్రంపై గట్టిగా తన వాయిస్ ను వినిపించడానికి ముందడుగు వేయడంలేదు. ముందడగు వేసిన జగన్ పార్టీ వాళ్ళపై  తమ పార్టీ నాయకులతో  దుమ్మెత్తి పోయిస్తున్నారు.  నిజంగా చిత్తశుద్ధి ఉంటె హోదా కోసం  ముఖ్యమంత్రి చంద్రబాబు తన సారథ్యంలోనే అఖిల పక్షం కమిటీ వేసి, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై పోరాటం చేయరెందుకని. ఎలాగో ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు జరుగుతాయంటున్నారుగా... ఇంకా అధికార పదవులు ఉంటే కొద్దీ నెలలే... ఈ కొద్దీ నెలలు కూడా అధికారం వదులుకుంటే ఏం పోతుంది. ఎం.పీ లతో రాజీనామా చేయించకపోయినా కనీసం కేంద్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మంత్రులతో రాజీనామా చేయించవచ్చు కదా... కనీసం ఆ పని అయినా ఎందుకు చేయరు... ఈ సమస్య ఏ ఒక్క పార్టీది కాదు... ఇది రాష్ట్ర ప్రజల సమస్య... నిజంగా పదవుల మీద కాకుండా... రాష్ట్రం మీద... రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రత్యేక హోదా కోసం సమిష్టిగా ఉద్యమించాలిసిన అవసరం ఉంది. వామపక్షాలు అంటున్నట్టు.. విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు ఉద్యమం లాగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తే రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేరుతాయి.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తె.దే.పా. వారు అధికారం వదులుకోలేరా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top