Translate

  • Latest News

    20, ఫిబ్రవరి 2018, మంగళవారం

    ఇప్పడు బంతి తెలుగుదేశం కోర్ట్ లో ఉంది..

    ఎవరి ప్లాన్ వారిదే. . కానీ ప్రస్తుతం జనం కోసం పోరాడుతున్నట్లు నటించాలి . విభజన హామీలపై కేంద్రంపై పోరాటం ఆసక్తికర మలుపులు తిరుగుతొంది. విభజన హామీల సాధన, ప్రత్యేక హోదా  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ’ని ఏర్పాటు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అవిశ్వాస తీర్మానం అంశాన్ని మొదటగా తెరపైకి తెచ్చారు. ఏపీ హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని సూచించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం  పార్ట్‌నర్ పవన్ సూచించినట్లుగా టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని, తాము కూడా మద్దతిస్తామని జగన్ ప్రకటించారు. ‘ఒకవేళ టీడీపీ ఆ పని చేయకపోతే మేం తీర్మానం పెడతాం.. అందుకు టీడీపీ మద్దతిస్తుందా?’ అని ప్రశ్నించారు. అప్పుడు మద్దతు ఇచ్చానేతప్ప తాను ‘టీడీపీ పార్ట్‌నర్‌’ను కానని పవన్  తెలిపారు. . ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన దిశగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విసిరిన సవాలుపై స్పందించారు.
    ‘‘రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయానికి వ్యతిరేకంగా కేంద్రంపై వైఎస్సార్‌సీపీనే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. అప్పుడు మాత్రమే టీడీపీ లైన్‌ ఏమిటనేది తెలుస్తుంది. వైఎస్సార్‌సీపీ తీర్మానం పెడితే.. నేనే స్వయంగా ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీల మద్దతు కోరతా. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నందున ఇవే ఆఖరి బడ్జెట్‌ సమావేశాలు కాబట్టి.. ఇప్పుడే హోదా కోసం బలంగా పోరాడాలి. ఒకవేళ వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టకుంటే ఎలాగూ టీడీపీకి అవకాశం దక్కుతుందికదా! ఇద్దరిలో ఎవరు ముందు తీర్మానం పెడతారో నాతోపాటు ప్రజలంతా ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు..’’ అని పవన్‌ పేర్కొన్నారు. ఇప్పడు బంతి తెలుగుదేశం కోర్ట్ లో ఉంది.. ఆట ఆడతారా... ఆడినా ఫౌల్ ప్లే ఆడతారా... ఒరిజినల్ గేమ్ ఆడతారా వేచి చూద్దాం. 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఇప్పడు బంతి తెలుగుదేశం కోర్ట్ లో ఉంది.. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top