Translate

  • Latest News

    21, ఫిబ్రవరి 2018, బుధవారం

    సరికొత్త రాజకీయానికి సుస్వాగతం



    ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు, నేతలకు భిన్నంగా సరికొత్త రాజకీయాలకు తెర  లేపుతున్న విలక్షణ నటుడు కమల్ హసన్ కు భిన్నస్వరం హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది. మతవాద రాజకీయాలకు  దూరంగా, కాషాయం పొడ అసలు ఏ మాత్రం గిట్టని, నిజాయతీ, నిబద్ధత, హేతువాద దృక్పధం కల కమల్ హాసన్ బుధవారం తన రాజకియ పార్టీ పేరు, విధి, విధానాలు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రజనీకాంత్, కరుణానిధి లను కలసి సరికొత్త, స్వచ్ఛమైన, విద్వేషాలకు తావు లేని రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఈ రోజు తన యాత్రను రామేశ్వరం లోని అబ్దుల్ కలామ్  ఇంటి నుంచి ప్రారంభించనున్నారు. అందులో భాగంగా కలామ్ సోదరుడిని కలసి ఆయన ఆశీర్వాదం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా కమల్ అభిమానులు కమల్, కలాం చిత్రాలతో ఊరి నిండా పోస్టర్లు, ఫ్లెక్సీలు వేశారు. అనంతరం రామనాథపురం, మన మధురై , పరమకుడి(కమలహాసన్ పుట్టిన ఊరు)లలో బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. సాయంత్రం మధురై లో జరిగే సభలో తన పార్టీ పేరు ప్రకటించనున్నారు. ఆ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఆయన పోకడ చూస్తుంటే ప్రధానంగా మత రాజకీయాలకు వ్యతిరేకంగా, అవినీతికి తావు లేని  స్వచ్ఛమైన, గుడ్ తమిళనాడు అందించడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. కమల్ రాజకీయాల్లో సక్సెస్ కావాలని భిన్నస్వరం అభిలషిస్తోంది. 
    -ఎడిటోరియల్ బోర్డు 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సరికొత్త రాజకీయానికి సుస్వాగతం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top