Translate

  • Latest News

    25, ఫిబ్రవరి 2018, ఆదివారం

    అతిలోక సుందరి అంతర్ధానం


    లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరు. బాలీవుడ్ నటుడు మొహిత్ మార్వా వివాహం నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. సడెన్‌గా హార్ట్ ఎటాక్ రావడంతో . శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రసీమలను కొన్నేళ్లు ఏలిన అతిలోకసుందరి శ్రీదేవి భువి నుంచి దివికి వెళ్లిపోవడం సినీ ప్రేక్షక లోకాన్ని విషాదంలోకి నెట్టింది.
    అ తిలోక సుందరి శ్రీదేవి 54 ఏళ్ల వయస్సులోనూ స్టన్నింగ్ బ్యూటీనే. 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రం రీఎంట్రీతో శ్రీదేవి అటు నటనలోనూ వెనక్కి తగ్గలేదని నిరూపించుకుంది. నటిగా ఏ పాత్ర పోషించినా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఆమె నైజం. బాలనటిగా అరంగేట్రం చేసిన శ్రీదేవి ఆ తర్వాత హీరోయిన్‌గా 80వ దశకంలో ఓ వెలుగు వెలిగింది. నాలుగు దశాబ్దాల పాటు 'అతిలోక సుందరి'గానే జనం నీరాజనాలు అందుకున్న శ్రీదేవి నాలుగైదు తరాల స్టార్ హీరోలందరితోనూ నటించింది.
     కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే శ్రీదేవి 'రూప్ కి రాణి చోరోం కా రాజా' చిత్రంలో 'దుష్మన్ దిల్ కా వో హై' పాట కోసం 25 కేజీలు బరువైన గోల్డెన్ డ్రెస్ ధరించి, పదిహేను రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారంటే ఒక పాత్ర కోసం ఆమెకున్న కమిట్‌మెంట్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల తమిళ 'పులి' చిత్రంలో 20కేజీల బరువైన కాస్ట్యూమ్స్‌ను ఆమె ధరించి అందర్నీ అందంతో మెస్మరైజ్ చేశారు.

     1963, ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి తన నాలుగేళ్లప్రాయంలోనే తమిళ సినిమాలో నటించింది. తమిళనాడులోని శివకాశి లో  జన్మించిన శ్రీదేవి తండ్రి న్యాయవాది. శ్రీదేవికి ఒక సోదరి, ఇద్దరు సవతి సోదరులు ఉన్నారు.
    1976 వరకూ శ్రీదేవి బాలనటిగా పలు చిత్రాల్లో నటించింది. 1976లో ఆమె తమిళ సినిమా ‘మూండ్రు ముడిచ్చు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.తన సుదీర్ఘ కెరియర్‌లో శ్రీదేవి మొత్తం 250 లకు పైగా  సినిమాల్లో నటించింది. 
    ఎందరు హీరోయిన్లు వచ్చినా, తెలుగు ప్రేక్షకుల ముందు ఎన్ని వయ్యారాలు ఆరబోసినా, ఇంకా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో శ్రీదేవి జ్ఞాపకాలు పదిలంగానే వున్నాయి.


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అతిలోక సుందరి అంతర్ధానం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top