Translate

  • Latest News

    3, ఫిబ్రవరి 2018, శనివారం

    సర్వేలు ప్రజల నాడిని ప్రతిబింబిస్తున్నాయా ..?


    సాధారణంగా సర్వేలు ప్రజల నాడిని ప్రతిబింబిస్తుంటాయి . అధికారంలో ఉన్న ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు పై ప్రజల మనోభావాలు స్పష్టమవుతాయి . ప్రతిపక్ష పార్టీ బలం ఎంతో  తేలిపోతుంది. ఇది తప్పని సరిగా ప్రజలపై ప్రభావం చూపుతుంది. అయితే ఇదంతా సర్వేలు నిస్పక్షపాతంగా జరిగినప్పుడే సాధ్యం. ఆశావహులతో పాటు రాజకీయ పార్టీలు, జాతీయ స్థాయి సంస్థలు, విద్యార్థి సంస్థలు వేర్వేరుగా సర్వేలకు దిగుతున్నాయి. ఎన్నికలు రానున్న నేపథ్యంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, ప్రజల ఆలోచన విధానం, ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాల పనితీరు, ఆయా పార్టీల నుంచి పోటీ చేసే ఆశావహుల పనితీరు ప్రజల్లో వారికి ఉన్న సానుకూల, వ్యతిరేక అంశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నాయి. ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ వ్యవస్థతోపాటు, ప్రైవేట్‌ సంస్థలతో సర్వేలు చేయిస్తోంది. అయితే ఆరు నెలలుగా జరిగిన వివిధ సర్వేల ఫలితాలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. ఆశావహులు సర్వే ఫలితాలను ఉత్కంఠతో పరిశీలిస్తున్నారు.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వైస్సార్ సీపీ కుడా  తమ బలాబలాను బేరీజు వేసుకునేందుకు సర్వేలను ప్రారంభించింది. విజయానికి సానుకూల, వ్యతిరేక అంశాలపై సర్వేలో లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది. యువత, మహిళలు, ఉద్యోగ, వ్యాపార, మధ్యతరగతి, కులాల వారీగా, మైనార్టీ, దళిత, గిరిజన వర్గాల్లో ఆయా అభ్యర్థులు తమ అనుకూల, వ్యతిరేక అంశాలపై సర్వే చేయించారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో సేకరించిన శాంపిల్స్‌ను క్రోడీకరిస్తున్నారు. బలం,బలహీనతలను గుర్తించడంతోపాటు వాటిని అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ప్లాన్‌ చేసుకుంటున్నారు.
    వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ఇప్పటినుంచే ప్రయత్నాలను ప్రారంభించారు. ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి ప్రత్యేక సర్వేలు చేయిస్తున్నారు. వాటి లోటుపాట్లు సరిచేసుకోడానికి ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌లను సిద్ధంచేసుకున్నారు. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రత్యేక టీంలను కూడా సిద్ధం చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ కూడా తానేమి తక్కువ కాదంటూ పీకే టీమ్ చేత ఇప్పటికే పలుమార్లు సర్వే చేయించింది. విషయమేమిటంటే మిగతా అంశాల మాట ఎలా ఉన్నా ప్రజా బలం సర్వే టీములు ఏ పార్టీ సర్వే చేయించిందో ఆ పార్టీకి అనుకూలం అన్నట్లు ఫలితాలు విడదల చేయటం చర్చకు దారి తీస్తోంది. 
    ప్రస్తుతం సర్వేలు  రాజకీయ రంగు పులుముకున్నాయి కొన్ని పేరున్న సంస్థలు మినహా మిగిలిన అన్ని సర్వే సంస్థలు ఆయా పార్టీలకు జేబు సంస్థలుగా మారిపోతున్నాయి. నిజంగా ప్రజల నాడి కనిపెట్టే సర్వేలు జరగటం లేద న్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం .. మరి మీరేమంటారు .. 
    ఎడిటోరియల్ డస్క్ 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సర్వేలు ప్రజల నాడిని ప్రతిబింబిస్తున్నాయా ..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top