Translate

  • Latest News

    8, ఫిబ్రవరి 2018, గురువారం

    పవన్ కు నిజంగానే జ్ఞానోదయం అయిందా..?

    బిజెపి పైనా, చంద్రబాబుపైనా జనసేనాని పవన్ కళ్యాణ్ కు  నమ్మకం పోయిందంట .. ...ఆయనకు ఇప్పుడే  కొత్తగా జ్ఞానోదయం అయినట్టు మాట్లాడటం విడ్డురంగా ఉంది.  బీజేపీపై  నమ్మకం రెండేళ్లలోనే పోయిందంటా , లేటెస్టుగా  చంద్రబాబుపైనా నమ్మకం పోయిందంట,  ఏపీ ప్రభుత్వంపై అవినీతి నివేదికలు రావడం బాధాకరం అని  సెలవిచ్చారు ఏపీకి ప్రత్యేక హెూదా కోసం తెలంగాణ తరహా జేఏసీ  ఏర్పాటు చేసి  ఉండవల్లి, జయప్రకాష్ నారాయణలతో చర్చిస్తానంటున్నారు. మంచిదే పవన్ లో నిజంగా ఈ మార్పు వచ్చి ఉంటె  సంతోషమే . కానీ ఇది మరొక కొత్త నాటకమైతే మాత్రం క్షమించరాని నేరం.  ఈ అనుమానం ఎందుకు వస్తుందంటే కేవలం కొన్ని రోజుల  కిందటే  చలోరే చలోరే చల్‌ యాత్రలో భాగంగా అనంతపురంలో పర్యటిస్తున్న  సందర్భంగా  ‘ప్రజాభీష్టం మేరకు, ప్రజలు కోరితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుపై నిర్ణయం తీసుకుంటా. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సరికాదు. ఏపీ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటయ్యేలా కృషి చేస్తాను. వెనుకబాటుకు గురైన రాయలసీమను సత్వరం అభివృద్ధి చేయకుంటే ప్రాంతీయవాదం తలెత్తే ప్రమాదం ఉంది’’ అంటూ  చెప్పిన పవన్... తెలుగు దేశం నాయకుల ఇళ్ళు వెతుక్కుని మరి వెళ్లి లంచ్, డిన్నర్ లు చేసి వచ్చిన పవన్ ఇంతలోనే ఇలా మాట్లాడడం సామాన్యులకు సైతం అనుమానాలకు తావిస్తోంది.  ఇది కూడా ఎవరో అదృశ్య శక్తులు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ఏమో అని అనుమానం. కాదు.. నిజంగానే జ్ఞానోదయం అయింది.... రాష్ట్ర ప్రయోజనాల కోసం  మాటపై నిలబడి పోరాటానికి సిద్దమే అయితే వెల్ అండ్ గుడ్. వెల్కమ్ పవన్ రా... నువ్వన్నట్టు జె.ఏ.సి పెట్టి పోరాటం చెయ్యి. అందుకోసం పోరాడుతున్న అందరితో కలసి పోరాటం చేయి. జగన్ తో కూడా.. మరి అందుకు నీవు సిద్ధమేనా..?


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పవన్ కు నిజంగానే జ్ఞానోదయం అయిందా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top