Translate

  • Latest News

    7, ఫిబ్రవరి 2018, బుధవారం

    అవును నిజమే... మీది భార్యాభర్తల సంబంధమే...


    అవును నిజమే... మాణిక్యాలరావు గారు... మీరన్నది నూటికి నూరు పాళ్ళు నిజం. మీది భార్యాభర్తల సంబంధమే... భార్యాభర్తలు అన్నాక మాటకు మాట అనుకోకుండా ఉంటారా.. అలుగుళ్ళు, అలక పాన్పులు మామూలే.. బెట్టు చేయడాలు... సముదాయించడాలు కూడా మామూలే... అలనాడు శ్రీ కృష్ణుడు, సత్యభామ ల నుంచి మనం వింటూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నాం... ఈ మీడియా వాళ్లకు బొత్తిగా బుద్ధి లేదు.. మొగుడు...పెళ్లాల గొడవల్లో వేలెడతారు... ఏదో...ఏదోదో జరిగిపోతొండంటూ నానా యాగీ చేసేస్తారు. నిజంగా మన చంద్రబాబు ప్రపంచంలోని భార్యలు అందరికి ఆదర్శం.. ఏదో కొద్దిగా బెట్టు చేస్తారే తప్ప భర్త మోడీ గారికి కోపం తెప్పించే పనులేమీ చెయ్యరు... ఆలా చేయవద్దని తన పిల్లలు అందరికి హిత బోధ కూడా చేస్తారు. మోడి, చంద్రబాబు బంధం ప్రపంచంలోని భార్యాభర్తలందరికి ఆదర్శప్రాయంగా ఉండేలా ఇంటర్మీడియేట్ లో పాఠంగా పెట్టించండి మాణిక్యాలరావు గారు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అవును నిజమే... మీది భార్యాభర్తల సంబంధమే... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top