Translate

  • Latest News

    4, మార్చి 2018, ఆదివారం

    రూ. 500 కోట్లతో అల్లు అరవింద్ రామాయణం సినిమా నిర్మాణం


    ప్రముఖ తెలుగు చలన చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మరో భారీ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. రూ. 500 కోట్లతో  రామాయణం సినిమా నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించనున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో ఆయనతో పాటు మధు మంతెన, నమిత మల్హోత్రా భాగస్వాములు కానున్నారు. ఇప్పటికే ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ తాను మహా భారతం సినిమాను నిర్మించనున్నట్టు  ప్రకటించారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ రామాయణం సినిమా నిర్మించనున్నట్టు ప్రకటించడం విశేషం. రామాయణం సినిమా ఈ ఏడాది చివర్లో పట్టాల మీదకు ఎక్కనున్నట్టు తెలుస్తోంది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రూ. 500 కోట్లతో అల్లు అరవింద్ రామాయణం సినిమా నిర్మాణం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top