Translate

  • Latest News

    10, మార్చి 2018, శనివారం

    రాజీనామాలు సరే ... ఇంకా ఎన్ డి ఏ లో ఎందుకు బాబూ...


    మీ మంత్రులతో రాజీనామాలు చేయించావు బాగానే ఉంది. వాళ్ళు రాజీనామాలు కూడా ఆమోదించేశారు. కేంద్రం మోసం చేసిందంటున్నావు. పార్లమెంట్ లో మీ ఎం.పీ లతో రోజూకో రకంగా ఆందోళన చేయిస్తున్నావు.. అంతా బాగానే ఉంది. మరి ఇంకా ఎన్ డి ఏ లో కొనసాగడం ఎందుకు బాబూ... అందులో నుంచి బయటకు వచ్చేయచ్చు కదా. వాళ్ళు మీకు హోదా ఇచ్చేది లేదు అని అంత స్పష్టంగా చెప్పాక కూడా ఇంకా అందులో కొనసాగుతాననడంలో అర్ధం ఏమిటి... పరమార్ధం ఏమిటీ.. పురందేశ్వరి ఏమో టీ డీ.పీ, బీ.జె.పీ బంధం బాగానే ఉంది అంటుంది. బీ.జె.పీ తో విడిపోలేదని బాబే స్వయంగా చెప్పారు అంటోంది. మరోవైపు నువ్వేమో సాయం చేయక పోగా ఎదురు దాడి అంటావు. మీ వాళ్ళతో మీటింగ్ పెట్టి బీజేపీ పై దుమ్మెత్తి పోయండి అని చెబుతావు ... ఈ ద్వంద్వ వైఖరి కి ఇకనైనా స్వస్తి చెప్పు బాబూ... 40 ఏళ్ల అనుభవం అంటూ డప్పాలు కొట్టుకుని చివరకు 9 ఏళ్ల అనుభవం ఉన్న జగన్ బాట లోకీ నువ్వు రాక తప్పలేదు.. ప్రజల్లో ఎక్కడ జగన్ ఇమేజ్ పెరిగిపోతుందో అనే భయంతో ప్రత్యేక హోదాపై  యూ టర్న్ తీసుకోక తప్పింది కాదు. ఇప్పటికి అయినా రెండు నాల్కల ధోరణికి స్వస్తి చెప్పి జగన్ లాగా క్లారిటీగా, చిత్తశుద్దిగా మాట్లాడు. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి మోసపోతారు.... రెండుసార్లు మోసపోతారు... ఎల్లకాలం మోసపోరని గుర్తు ఉంచుకో.... 
    పోయిన ఎన్నికల ముందు నేను మారాను... నన్ను నమ్మండి.. అంటే నమ్మి మోసపోయారు... నువ్వు మారిన మాట నిజమే.  కానీ ఇలా మారతావనుకోలేదు... గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నావు. ప్రభుత్వ కార్యాలయాల్లో  అవినీతికి తావు లేని పాలన అందించావు. ప్రభుత్వ పధకాల అమలు విషయంలో కుడా అందరికి అందేలా చేశావు. కానీ ఈ సారి అలా కాదే.. విచ్చలవిడి అవినీతి కి నువ్వే అండదండగా ఉన్నావు. నీ ఎం.ఎల్.ఏ లు  తహసీల్దార్ లను కొట్టినా ఏమి అనవు. నువ్వు చాలా మారావు. జన్మభూమి  కమిటీలు అంటూ ప్రభుత్వ పథకాలన్నీ పచ్చ చొక్కాలకే...   ప్రజలు కూడా ఈ సారి మార్పు కోరుకుంటారని గుర్తు ఉంచుకో. 
    ఇట్లు 
    ఒక సామాన్యుడు 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రాజీనామాలు సరే ... ఇంకా ఎన్ డి ఏ లో ఎందుకు బాబూ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top