Translate

  • Latest News

    13, మార్చి 2018, మంగళవారం

    కట్టప్ప విగ్రహం


    'బాహుబలి' అంటే ప్రాథమికంగా నాలుగు నాలుగు పాత్రలు గుర్తొస్తాయి. అందులో బాహుబలి, భల్లాలదేవ, శివగామి, కట్టప్ప. అందులోనూ మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టుబానిస 'కట్టప్ప' పాత్రలో భలే మెప్పించారు సత్యరాజ్‌. ఆ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఈయన. ఇప్పుడు సత్యరాజ్‌కు అరుదైన గౌరవం లభించింది. గత ఏడాది బాహుబలి పాత్రధారి మైనపు విగ్రహాన్ని లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజయంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు కట్టప్ప మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. తమిళ చిత్రసీమ నుంచి ఓ నటుడి విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఈ విషయాన్ని సత్యరాజ్‌ కుమారుడు, నటుడు సిబిరాజ్‌ సామాజిక మాధ్యమం ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కట్టప్ప విగ్రహం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top