Translate

  • Latest News

    14, మార్చి 2018, బుధవారం

    గడ్డి పరకలను పేనుతున్న సోనియా


    కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాజకీయ పరిణితి ప్రదర్శిస్తున్నారు. 72 ఏళ్ల  వయసులో సైతం ఆమె చురుకయిన రాజకీయ వేత్తగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కుమారుడు రాహుల్ గాంధీ కి అప్పగించినా తాను  చేతులు ముడుచుకు కూర్చోలేదు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు  వ్యూహాలను రూపొందించడంలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే ఆమె మంగళవారం రాత్రి తన నివాసమైన 10 జన్ పథ్ లో బి.జె.పీ యేతర 20 ప్రతిపక్ష పార్టీలకు డిన్నర్ ఇచ్చారు. ఈ డిన్నర్ కు హాజరైన వారు శరద్ పవార్(ఎన్.సి.పీ ), అజిత్ సింగ్ (ఆర్.ఎల్.డి),ఎస్.పీ నుంచి రాంగోపాల్ యాదవ్, సతీష్ చంద్ర మిశ్రా(బి.ఎస్.పీ), శరద్ యాదవ్ (జె.డి.యూ బహిష్కృత నేత) ఆర్.జె.డి తరపున లాలూ కూతురు మిస భారత, కొడుకు తేజస్వి యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుదీప్ బందోపాధ్యాయ, సి.పీ.ఐ నుంచి  డి.రాజా, సి.పీ.ఎం నుంచి మహ్మద్ సలీమ్, డి.ఎం.కె నుంచి కరుణానిధి కూతురు కనిమొళి, ఏ.ఐ.యూ డి.ఎఫ్ కు చెందిన బద్రుద్దీన్ అజమల్, జె.డి.ఎస్ నుంచి కుపేందర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా(జమ్మూ కాశ్మిర్), బాబూలాల్ మారండి(జార్ఖండ్ ), హేమంత్ సొరేన్(జార్ఖండ్), జితన్ రామ్ మాంఝి(బీహార్)తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా హాజరయ్యారు. వాటిలో అధికారంలో ఉన్న పార్టీ ఒక్క తృణమూల్ కాంగ్రెస్(వెస్ట్ బెంగాల్ ) మాత్రమే... మిగతావన్నీ ఆయా రాష్ట్రాలలో అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నవే. మిగిలిన వారిలో కాస్త బలమైన నాయకులు  శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, ఒమర్ అబ్దుల్లా, తమిళనాడులో డి.ఎం.కే. ప్రస్తుతం ఇవన్నీ గడ్డి పరకలే కావచ్చు. ఆ గడ్డి పరకలనే పేని బలమైన  మోకుగా తయారుచేసి మనువాద మతోన్మాదంతో మత్తెక్కిన మదగజాన్ని బంధించడానికి సోనియా చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: గడ్డి పరకలను పేనుతున్న సోనియా Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top