Translate

  • Latest News

    27, మార్చి 2018, మంగళవారం

    హీరోలా... జీరోలా..?



    సినిమాల్లో వారు తిరుగులేని  హీరోలు... అందరికి అభిమాన పాత్రులు... అందరి వారు.. ఇప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టి కొందరి వారుగా మిగిలిపోయారు. హీరోలు జీరోలుగా  మారిపోతున్నారు. ఇతర రాజకీయ పార్టీల నాయకులతో నానా మాటలు అనిపించుకోవలసిన దుస్థితి వచ్చిపడింది. ప్రపంచ స్థాయి నటుడిగా అందరూ అభిమానించే కమల్ హాసన్ చెత్త కుప్ప లాంటి రాజకీయాల్లో అడుగు పెట్టి... ఆ దుర్గధం తాలూకు మురికి వాసన అనుభవించాల్సి వస్తోంది. డి.ఎం.కే నాయకుడు స్టాలిన్ కమల్ హాసన్ ను గోడ మీద పిల్లి లాంటోడు అని విమర్శించడం కమల్ అభిమానులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కూడా జన సేన పార్టీ పెట్టి ప్రత్యర్థులతో అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే వీరిద్దరికి ఒక సారూప్యం కనపడుతోంది. ఇద్దరూ ప్రధాన పార్టీలతో వీటితో కలవకుండా వామ పక్షాలను మాత్రమే కలుపుకుంటూ ముందుకు సాగుతుండడం గమనార్హం. మున్ముందు వీరు రాజకీయాల్లో హీరోలు అవుతారా.. జీరోలుగా మిగిలిపోతారా అనేది వేచి చూడాలి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: హీరోలా... జీరోలా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top