Translate

  • Latest News

    8, మార్చి 2018, గురువారం

    జగన్ క్లియర్.. బాబు ఇంకా దాగుడుమూతలే ...


    ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గమనించాక గత్యంతరం లేని పరిస్థితుల్లో యూ టర్న్ తీసుకున్న తెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు కేంద్ర మంత్రివర్గం లో నుంచి తన మంత్రులను వెనక్కు తీసుకోవడం హర్షణీయం. తెలుగు దేశం పార్టీ చర్యకు ప్రతిగా రాష్ట్రంలో బి.జె.పీ మంత్రులు కూడా మంత్రివర్గంలో నుంచి వైదొలిగారు. తెలుగుదేశం నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజుకుంది. అయితే ఇప్పటికి చంద్రబాబు ఇంకా దాగుడు మూతలే ఆడుతున్నారు. మంత్రివర్గం లో నుంచి వైదొలగుతున్నామే తప్ప ఎన్.డిఏ లో కొనసాగుతాం అంటున్నారు. అంటే మోడీతో బేరాలు ఆడదానికి ఒక ఛాన్స్ ఉంచుకున్నారన్న మాట.   మరో వైపు కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  
    ఇదే సమయంలో జగన్ ఈ రోజు ప్రెస్ మీట్ లో తన వైఖరి చాలా స్పష్టంగా చెప్పారు. హోదా ఇస్తామని ఎవరు సంతకం పెడితే వారికే మా మద్దతు అని. బి.జె.పీ ఇవ్వనని క్లియర్ గా చెప్పేసింది  కాబట్టి దానితో కలిసే అవకాశం లేదు. కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు. మాకు 25 మంది ఎం.పీ లను గెలిపించి ఇవ్వండి... అప్పడు... కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో గట్టిగా ఫైట్ చేసి.. హోదా కు అనుకూలంగా సంతకం పెట్టె వారికే మద్దతు ఇస్తామని క్లియర్ గా చెప్పారు. తెలుగుదేశం కు చిత్తశుద్ధి ఉంటే మేము పెట్టె అవిశ్వాసానికి మద్దతు ఇవ్వండి... లేదా వారు అవిశ్వాసం పెడితే మేము మద్దతు ఇస్తాం అని కూడా చెప్పారు. హోదా కోసం చిత్తశుద్ధితో చంద్రబాబు పోరాడదల్చుకుంటే ఇంకా ఎన్.డిఏ లో  కొనసాగడం ఎందుకో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్ర బాబు ఇకనైనా దాగుడు మూతలాట మాని ప్రత్యేక హోదా కోసం  వై.సి.పీ తో సహా అన్ని పార్టీలను కలుపుకుని పోరాటం చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జగన్ క్లియర్.. బాబు ఇంకా దాగుడుమూతలే ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top