Translate

  • Latest News

    17, ఏప్రిల్ 2018, మంగళవారం

    అందరూ శ్రీవైష్ణవులే...బుట్టలో చేపలు మాయం...


    అందరూ శ్రీవైష్ణవులే...బుట్టలో చేపలు మాయం... అన్నట్టుంది కోర్టు తీర్పు... మక్కా మసీదు పేలుళ్ల బాధ్యులం మేమే అని స్వయంగా ఆ కేసులో నిందితులైన స్వామి అసిమానంద, లోకేష్ శర్మ చెప్పినప్పటికీ... ప్రాసిక్యూషన్ కోర్టు ముందు రుజువు చేయలేకపోయినందున అందరూ నిర్దోషులే అని కోర్టు తీర్పు చెప్పింది. స్వామి అసిమానంద నేరాంగీకార వాంగ్మూలానికి ఎటువంటి చట్టబద్ధత లేదని కోర్టు పేర్కొనడం గమనార్హం. పోలీస్ కస్టడీలో ఉండగా ఢిల్లీ పంచకుల కోర్టులో స్వామి అసిమానంద వాంగ్మూలాన్ని నమోదు చేసారు కాబట్టి అది చెల్లదని పేర్కొన్నారు. నిందితులు నేరం చేసినట్టుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనదని, ఏ ఒక్క అభియోగానికి ఆధారాలు చూపలేకపోవడంతో కేసు కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. మరి అందరూ నిర్దోషులే అయితే  మా పిల్లల్ని బాంబులు పెట్టి చంపిందెవరు... అని ప్రశ్నిస్తున్నారు బాధితుల తల్లిదండ్రులు. దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసు లో మూడేళ్ళ లోనే విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పి నిందితులకు ఉరిశిక్ష వేయించిన దర్యాప్తు అధికారులు.... మక్కా మసీద్ బాంబు పేలుళ్ల కేసులో మాత్రం 11 ఏళ్ల తర్వాత కూడా నిందితులపై నేరం రుజువు చేయలేక కేసు కొట్టివేయడం సమాజంలో లేనిపోని అనుమానాలకు తావిస్తోంది. పైగా ఈ కేసులో తీర్పు వెలువరించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) ప్రత్యేక న్యాయస్థానం  జడ్జి రవీంద్ర రెడ్డి తీర్పు వెలువరించిన వెంటనే రాజీనామా చేసినట్టు వస్తున్న వార్తలు కూడా మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఉదయం 11.50 కి తీర్పు ఇచ్చిన జడ్జి రవీంద్ర రెడ్డి మధ్యాన్నం కల్లా రాజీనామా లేఖను హై కోర్టు కు పంపినట్టు తెలుస్తోంది. ఆయన రాజీనామాకు కారణాలు స్పష్టంగా వెల్లడి కాలేదు.  ఏది ఏమైనా దిల్ షుక్ నగర్, మక్కా మసీద్ కేసుల్లో రెండు విభిన్నమైన తీర్పులు సమాజంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.  
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అందరూ శ్రీవైష్ణవులే...బుట్టలో చేపలు మాయం... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top