Translate

  • Latest News

    16, ఏప్రిల్ 2018, సోమవారం

    హిందూత్వ ఉగ్రవాదులతోనే దేశానికి ముప్పు


    మన దేశానికి ప్రధానంగా హిందూత్వ ఉగ్రవాదులతోనే  ముప్పు ఉంది. న్యూటన్ థియరీ ప్రకారం చర్యకు ప్రతి చర్య అనేది సహజంగా ఉంటుంది. 1992 డిసెంబర్ 6 న ఆర్.ఎస్.ఎస్, విశ్వహిందూ పరిషత్ తదితర ఉగ్రవాద శక్తులు బాబ్రీ మసీద్ కూలగొట్టడం వల్లే 1993 మార్చి 12 న ముస్లిం ఉగ్రవాదులు ముంబయి లో బాంబులు పెట్టి 257 ప్రాణాలను బలి తీసుకున్నారు. బాబ్రీ ఘటనతో ఆర్.ఎస్.ఎస్ మన దేశంలో రాజేసిన అగ్గి దావాలనమై ఆరని జ్వాలలా ఇంకా రగులుతూనే ఉంది. 

    భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మన దేశంలో హిందుత్వ ఉగ్రవాద శక్తులు అనేకసార్లు ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాయి. 1947 లో జమ్మూ, 1969 లో గుజరాత్, 1980 లో మొరాదాబాద్, 1983 లో నెల్లి, 1985 లో గుజరాత్,  1987లో హసీంపురా, 1989లో భాగల్పూర్, 1992 లో బొంబాయి, 2002లో గుజరాత్, 2006లో మాలేగావ్, 2007 లో హైదరాబాద్, 2014లో అసోం లలో హిందుత్వ శక్తులు ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాయి. 

    80 దశకంలో జరిగిన అల్లర్ల తర్వాత ఎక్కడా... ఏ గొడవలు లేకుండా ప్రశాతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో హిందుత్వ ఉగ్రవాద శక్తులు ఒక పధకం ప్రకారం 2007 మే 18 న మక్కా మసీదులో బాంబులు పెట్టడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 16 మంది మరణించారు. ఈ దారుణం ముస్లిం ఉగ్రవాదుల పనే అని తొలుత పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో వందలాది ముస్లిం అమాయక యువకులను అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టారు... ఈ చర్య ముస్లిం సమాజంలో తీవ్ర అశాంతిని రేపింది. తత్ఫలితంగానే అదే సంవత్సరం ఆగష్టు 25న ముస్లిమ్ తీవ్రవాదులు లుంబిని పార్క్ లోను, గోకుల్ చాట్ వద్ద బాంబులు పెట్టారు. ఈ ఘటనలో 42 మంది మరణించారు. ఈ రెండు ఘటనలతో నగర ప్రజలు అభద్రతా వాతావరణంలో కొన్నాళ్ల పాటు బిక్కుబిక్కు మంటూ గడపాల్సి వచ్చింది. అయితే నిలకడ మీద నిజం వెల్లడైనది. మక్కా మసీద్ లో బాంబులు పెట్టింది ముస్లిం ఉగ్రవాదులు కాదని, హిందుత్వ ఉగ్రవాద శక్తులేనని తెలిసి యావద్భారత దేశం ఆశ్సర్యపోయింది. మాలెగావ్  పేలుళ్ల కేసు దర్యాప్తు చేస్తుండగా ఆ కేసులో నిందితుడైన లోకేష్  శర్మను విచారించగా మక్కా మసీద్ పేలుళ్ల పని కూడా వారి ఘన కార్యమేనని వెల్లడైనది. 2006 సెప్టెంబర్ 8 న జరిగిన ఈ పేలుళ్లలో 37 మంది మరణించారు. అభినవ్ భారత్ అనే హిందుత్వ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడింది. ఇది జరిగిన 8 నెలల 8 రోజులకు మక్కా మసీద్ ఘటన జరగడం గమనార్హం. 2013 ఫిబ్రవరి 21 న దిల్ సుఖ్ నగర్ లో మరోసారి ముస్లిం ఉగ్రవాదులు బాంబులు పెట్టి 18 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఐదేళ్ల కిందట జరిగిన దిల్ సుఖ్ నగర్ కేసు లో నిందితులకు శిక్షలు పడ్డాయి...మంచిదే... మరి 11 ఏళ్ల  కింద జరిగిన మక్కా మసీద్ కేసులో ఈ రోజు ఇచ్చిన తీర్పులో అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు...ప్రధాన నిందితులు ఐదుగురు స్వామి అసీమానంద, లోకేష్ శర్మ, దేవేందర్ గుప్తా, భరత్ మోహన్ లాల్, రాజేందర్ చౌదరి లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.  ఈ  తీర్పు మరే  అశాంతికి దారి తీస్తుందోననేదే సగటు భారతీయుడి ఆవేదన. 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: హిందూత్వ ఉగ్రవాదులతోనే దేశానికి ముప్పు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top