Translate

  • Latest News

    15, ఏప్రిల్ 2018, ఆదివారం

    ఓ గుప్పెడు సానుభూతి ఇప్పించండి ప్లీజ్ ...


    దారులన్నీ మూసుకుపోయిన వేళ,,, అటు కేంద్రం లోనూ... ఇటు రాష్ట్రం లోనూ... అయిన వాళ్ళందరూ శత్రువులుగా మారిపోయిన వేళ ...  వెన్నుపోటుకు బ్రాండ్ నేమ్ అయిన చంద్రబాబుకే వెన్నుపోటు పొడిచిన వేళ... 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న మగధీరుడిని... 40 ఏళ్ల పిల్ల రాజకీయ బుడతడు శాసిస్తున్న వేళ... ఏం చేయాలో పాలుపోక ఐదు కోట్ల తెలుగు ప్రజల సానుభూతి కోసం పుట్టిన రోజు నాడు నిరాహార దీక్ష చేయాలని సంకల్పించారు మన చంద్రబాబు గారు. అయ్యో పాపం... ఎంత కష్టం వచ్చింది... పుట్టిన రోజు నాడు అన్న పానీయాలు ముట్టకుండా ఉండడం... అదీ మన కోసం... ఐదు కోట్ల ప్రజల బాగు కోసం ... ఓ గుప్పెడు సానుభూతి ఇవ్వండి... ప్లీజ్... 
    వచ్చే ఎన్నికల్లో తోడు వచ్చే పార్టీలు ఏవి కనపడడం లేదు... ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చేటట్టు ఉంది. వై.ఎస్ రాజశేఖర రెడ్డి అంటే... 2009 లో ప్రతిపక్షాలన్నీ ఏకమై మహా కూటమి అని పెట్టి పోటీ చేసినా... ఒంటరిగా ఎదుర్కొని షంషేర్ గా గెలిచి చూపించాడు కానీ... మన బాబు గారి గెలుపులన్నీ ఎప్పుడూ ఎవరో ఒకరి అండతోనే కదా... ఇప్పుడు... ఏ అండా లేకుండా ఎన్నికల్లో ఒంటరి పోరాటమా... తలచుకుంటేనే బాబు గారికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. డబ్బుతో గెలిచేయవచ్చు అని నమ్మకం ఉన్నా . బాబు గారు చాలా తెలివిగల వారు కదా... ఒక్క డబ్బునే ఆయన ఎప్పుడూ నమ్ముకోలేదు... డబ్బుతో పాటు... కూటములను నమ్ముకున్నారు. మొన్న గెలిపించింది... ఆ పవన్ కల్యాణుడే కదా... మరిప్పుడు ఏ తోడూ లేకుండా ఎలా... బాబు గారికి నిద్ర పట్టడం లేదు... 
    అసలే నిన్న జగన్ పాదయాత్రకు  కనక దుర్గమ్మ వారధి మీద వచ్చిన జనాలకి వారధి ఒక్క క్షణం... కంపించిందట... ఆ కంపం ఏమో గాని... ఇక్కడ బాబు గారి హృదయంలో భూకంపం వచ్చింది.... ప్లీజ్... ఓ గుప్పెడు సానుభూతి చూపించండి... అన్నట్టు మరిచాను... సానుభూతి అంటే గుర్తొచ్చింది... 2003 లో మన బాబు గారి మీద నక్సలైట్లు దాడి చేస్తే ప్రాణాలతో బయటపడ్డారు... ఆ సానుభూతితో మళ్లి  గెలిచేద్దామని 2004 లో ముందస్తు ఎన్నికలకు సై అన్నారు... కానీ పాపం... సానుభూతి అస్త్రం పని చేయలేదు... 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండవలసివచ్చింది. సరిగ్గా ఇప్పడు రాష్ట్రంలో 2003 నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.. బాబు గారి పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు.. అన్ని వర్గాల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు... సారీ  బాబు గారు.. ఈ సారి కూడా ఏ సానుభూతి పనిచేయక పోవచ్చేమో... ఏది ఏమైనా మీకు ఇదిగో...  నా గుప్పెడు సానుభూతి ఇస్తున్నా తీసుకోండి... 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఓ గుప్పెడు సానుభూతి ఇప్పించండి ప్లీజ్ ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top