Translate

  • Latest News

    21, ఏప్రిల్ 2018, శనివారం

    డిఫెన్సులో పడ్డ చంద్రబాబు


    చంద్రబాబుకు కేసుల  భయం పట్టుకుందా... కర్ణాటక ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు పై ఉన్న కేసులను దుమ్ము దులిపి బయటకు తీసి చర్యలు తీసుకోనుందా... దీక్షలు వద్దన్న చంద్రబాబు సడన్ గా దీక్షలకు దిగడం, పార్టీ శ్రేణులతో సైతం వాడవాడలా దీక్షలు చేయించడం చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. మూడు రోజుల  క్రితం ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్  చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశం అవడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన అమిత్ షా, మోడీ ద్వయానికి చంద్రబాబు ఒక లెక్కా... పైగా ఆల్రెడీ చంద్రబాబు పిలక (ఓటుకు నోటు కేసు) వాళ్ళ చేతుల్లో ఉంది. దానికి తోడు చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ బాబుకు శేఖర రెడ్డి కేసులో ప్రమేయమున్నట్టు కూడా ఆధారాలున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా.... అప్పటినుంచే చంద్రబాబు డిఫెన్సులో పడ్డాడు. ఇప్పటిదాకా తన అఫెన్సు పాలిటిక్స్ తో  ప్రత్యర్థులపై ఎప్పుడు పైచేయిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు డిఫెన్సులో పడ్డాడు. అందులో భాగంగానే దీక్షకు దిగాడు. తనతో పాటు పార్టీ శ్రేణులను కూడా సమాయత్తం చేసి అన్ని జిల్లాల్లోనూ దీక్షలు చేయించాడు. ఈ నాలుగేళ్లు దోచుకుని... దాచుకోవడంలో మునిగిపోయిన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు  ఇక మిగిలిన ఏడాది కాలమంతా పోరాట సంవత్సరమే... వాడవాడలా దీక్షలు చేసినట్టుగానే భవిష్యత్తులో వాడవాడలా పోరాటాలు చేయించేందుకు చంద్రబాబు సమాయత్తం చేస్తున్నాడు.  భవిష్యత్తు పోరాటాలకు ఇది రిహార్సల్. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందిన సమాచారంతో భవిష్యత్తు కళ్ల ముందు కనపడుతుంటే... క్రైసిస్ మేనేజ్ మెంట్ లో దిట్ట అయినా చంద్రబాబు వెంటనే తన వ్యూహాలను మార్చి, సరికొత్త వ్యూహాలను రూపొందించి పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. చూద్దాం... రాష్ర్ట్ర రాజకీయాల్లో రానున్న రోజుల్లో ఇంకెన్ని విచిత్రాలు జరుగుతాయో... 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: డిఫెన్సులో పడ్డ చంద్రబాబు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top