Translate

  • Latest News

    22, ఏప్రిల్ 2018, ఆదివారం

    చట్టాలెన్ని చేస్తేనేం... అమలులో చిత్తశుద్ధి లేనప్పుడు....



    నిర్భయ(జ్యోతిసింగ్ పాండే) ఉదంతం జరిగిన 2012 లో దేశంలో మొత్తం 24923 రేపులు జరగ్గా... అందులో 24,470 రేప్ కేసుల్లో బాధితులకు నిందితులు తెలిసిన వారే... దేశాన్నే కుదిపేసిన నిర్భయ అత్యాచారం అనంతరం కూడా దేశంలో రేప్ కేసులు ఇంకా పెరిగాయే తప్ప తగ్గలేదు. 2013 లో దేశంలో 33,707 రేప్ కేసులు జరగడం గమనార్హం. 2014, 2015 లలో సైతం 34 వేలకు పైగా అత్యాచారాలు జరిగాయి. 2016 లో 38,947, 2017 లో సగటున రోజుకు ఐదు రేప్ కేసులు చొప్పున జరిగాయి. ఈ ఏడాది వరుసగా జనవరి నుంచి జరిగిన కథువా, ఉన్నావ్, సూరత్ రేప్ ఘటనలు మరోమారు యావత్భారత దేశాన్ని కదిలించాయి. ఈ నేపధ్యం లోనే పోయిన పరువు ప్రతిష్టలను కొంతవరకయినా రికవర్ చేసుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పీ ప్రభుత్వం ఉరి శిక్ష వంటి కఠిన చట్టాలు అమలు చేయాలని నిర్ణయించింది. నిర్భయ ఉదంతం తరవాత కూడా ఇలాగే ఏలికలు చాలా చాలా శపధాలు చేశారు... కానీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేకపోగా ఇంకా ఎక్కువయ్యాయి. చట్టాలెన్ని చేస్తేనేం... అమలులో చిత్తశుద్ధి లేనప్పుడు.... సరే ఈ సారన్నా చేసిన చట్టాలను సమర్ధంగా, చిత్తశుద్ధితో అమలు చేస్తారని ఆశిద్దాం. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చట్టాలెన్ని చేస్తేనేం... అమలులో చిత్తశుద్ధి లేనప్పుడు.... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top