Translate

  • Latest News

    25, ఏప్రిల్ 2018, బుధవారం

    బీ.సి.లు ఇకనైనా కళ్ళు తెరవండి...


    బీ.సి ల్లారా... ఇకనైనా కళ్ళు తెరవండి. ఎన్టీఆర్ హయాంలో బీ.సి లకు పెద్ద పీట  వేసినందుకు గత మూడున్నర దశాబ్దాలుగా ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. తప్పు లేదు.. ఋణం తీర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం కాదు... చంద్రబాబు సారధ్యంలోని కమ్మ దేశం. అక్కడ కమ్మ వారికి మాత్రమే పెద్ద పీట. మిగతా వారికి పదవులిచ్చినా వాళ్ళు కీలుబొమ్మలే తప్ప... కీలక వ్యక్తులుగా ఎదగలేరు... ఎదగనివ్వరు. అది చంద్రబాబు రాజకీయం. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కల రాజకీయ నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు  ......... ......  20 ఏళ్ల క్రితమే సమాజంలో అన్ని ముఖ్యవ్యవస్థల్లోనూ తన (కమ్మ) మనుషులను పెట్టుకుని స్లో పాయిజన్  ఎక్కించేసి అన్ని వ్యవస్థలను విషతుల్యం చేసిపారేశారు. ఆ చర్యల ఫలితంగానే ఇప్పుడా కుల సర్పాలు విషం చిమ్ముతున్నాయి. కడివెడు పాలల్లో ఒక్క విషం చుక్క అన్నట్టుగా కేవలం 5 శాతం ఉన్న సామాజిక వర్గం చిందిస్తున్న విషం సమాజం మొత్తంపై తన ప్రభావాన్ని చూపిస్తోంది. కుల రక్కసి కోరలు చాచి బడుగు, బలహీన వర్గాల ప్రజల జాతకాలను తారుమారు చేస్తోంది. 
     ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్థంభాలైన శాసనకర్తలు, పరిపాలనాధికారులు, న్యాయవ్యవస్థ, జర్నలిజం ఈ నాలుగు వ్యవస్థల్లో ఒక పధకం  ప్రకారం తన మనుషులను పెట్టుకుంటూ వచ్చారు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో... వారే చంద్రబాబును పలుసార్లు కేసుల బారి నుంచి గట్టెక్కించారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.. అయితే ఇప్పుడు జాతీయ బి.సి. కమిషన్ మాజీ చైర్మన్ వంగా ఈశ్వరయ్య వెల్లడించిన విషయాలు సమాజంలో అనేక ప్రశ్నలను రేపుతున్నాయి.
    న్యాయవాదుల  సామర్ధ్యానికి ముఖ్యమంత్రి మార్కులేస్తారా..?
     న్యాయవాదుల సామర్ధ్యాన్ని ముఖ్యమంత్రి అంచనా వేసి మార్కులు వేస్తారా... హవ్వ... ఇదేమి న్యాయం... పైగా కొలీజియం నిర్ణయాన్నే తప్పంటారా... వారిది తొందరపాటు అంటారా... కొలీజియం సిఫార్స్ చేసిన జస్టిస్ అమర్నాధ్ గౌడ్, జస్టిస్డీ.వీ.ఎస్.ఎస్ సోమయాజులు, జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ పి .కేశవరావు, జస్టిస్ గంగారావు, జస్టిస్ అభినందకుమార్ షావిలి... ఈ ఆరుగురిలో ఏ ఒక్కరూ  న్యాయమూర్తులుగా పనికిరారని  కమ్మదేశం పీఠాధిపతి చంద్రబాబు తీర్పు ఇచ్చేశారట... కొలీజియం నిర్ణయం తొందరపాటు చర్యగా అభివర్ణించారట... అక్కడితో ఆగక కొలీజియం పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ కూడా రాశారట.. ఇదండీ... కమ్మదేశం పీఠాధిపతి అసలు బాగోతం... ఆరుగురిలో ఒక్క కమ్మ పేరు లేకపోవడమే బాబు గారు అంత చిందులు తొక్కడానికి కారణం అని ఈశ్వరయ్య వెల్లడించారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే బాబు గారి వ్యాఖ్యలను వెంట్రుక ముక్క లా తీసిపారేసి సుప్రీం కోర్ట్ జస్టిస్ అమర్నాధ్ గౌడ్ తదితరులను జడ్జి లుగా నియమించింది. 
    సో... ఇప్పటికయినా బి.సి వర్గాలు కళ్ళు తెరిచి తెలుగుదేశం... కాదు..కాదు కమ్మ దేశం కబంధ హస్తాల నుంచి  ఎంత త్వరగా బయట పడితే అంత మంచిది. బి.సి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ వర్గాలన్నీ ఒక్క తాటి పైకి వచ్చి రాజ్యాధికార సాధనకు ఉద్యమించాలి. జై.. భీమ్ .. జై.జై.. భీమ్... 
    • Blogger Comments
    • Facebook Comments

    1 comments:

    Item Reviewed: బీ.సి.లు ఇకనైనా కళ్ళు తెరవండి... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top