Translate

  • Latest News

    29, ఏప్రిల్ 2018, ఆదివారం

    కాస్టింగ్ కౌచ్ కు విరుగుడు మందు ఇదే..?


    కాస్టింగ్ కౌచ్... గత రెండు నెలలుగా  తెలుగు సినీ ఇండస్ట్రీ ని కుదిపేస్తున్న పదం ఇది. బయటి వాళ్లకు ఇది కొత్తగా ఉండొచ్చు కానీ... ఇండస్ట్రీ లోపలి వాళ్లకు బాగా తెలిసిన పదమే... తారాపథానికి దూసుకుపోవాలంటే... ఆ పదమే పరమపద సోపానం అని... చాలామంది యువతులు తెలిసో... తెలియకో...  ఆ ఊబిలోకి దిగుతుంటారు. తీరా దిగాక...  కాలు జారక తప్పదు... గోతిలో పడక  తప్పదు... దెబ్బలు  తినక తప్పదు... ఒక్కసారి  ఆ ఊబిలోకి దిగాక... ఇంకా బయటకు రాలేరు... అక్కడే ఉంటూ...  మెయింటైన్ అవడానికి చివరకు వ్యభిచారం లోకి దిగుతారు.... లేదా బలవంతంగా దింపబడతారు. ఇది దశాబ్దాలుగా నడుస్తున్న చరిత్రే.... ఇప్పుడు శ్రీ రెడ్డి ద్వారా  ఈ విషయం వెలుగులోకి రావడానికి వెనుక అనేకానేక కారణాలు ఉంది ఉండొచ్చు... ఏది.. ఏమైనా... శ్రీ రెడ్డి వ్యక్తిగతం సంగతి ఎలా ఉన్నా... ఆమె లేవనెత్తిన పాయింట్ మాత్రం... నూటికి నూరు పాళ్ళు నిజం... అందుకే మహిళా సంఘాలు ఆమెకు మద్దతు పలికాయి... శ్రీ రెడ్డి మొదట నగ్న నిరసన తెలియచేసినప్పుడు ఏదో సంచలనం కోసం చేసిందిలే అని అంత సీరియస్ గా ఎవరూ తీసుకోలేదు కానీ... ఎప్పుడైతే  పీ.ఓ.డబ్ల్యు సంధ్య, దేవి, సజయ  తదితర మహిళా సంఘాల నాయకులు  ఎంటర్ అయ్యారో ... అది ఒక ఉద్యమ రూపం సంతరించుకుంది. కేంద్ర మానవ హక్కుల కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి, సినిమాటోగ్రఫీ మంత్రికి నోటీసులు జారీ చేసింది. దీంతో సినీ పరిశ్రమ పునాదుల్లోనే ప్రకంపనలు మొదలయ్యాయి. వెంటనే ఫిలిం ఛాంబర్ నష్ట నివారణ చర్యల్లో భాగంగా శ్రీ రెడ్డి పై విధించిన బాన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడమే కాక, కాస్టింగ్ కౌచ్ పై త్వరలో ఒక కమిటీ వేస్తామని కూడా ప్రకటించింది. అక్కడికి ఆ ఉద్యమం ఆ మేరకు విజయం సాధించినట్టే... తర్వాత ఈ అంశం లో రాజకీయాలు చొరబడి... పలువురు వ్యక్తులు తెరపైకి రావడం... రక రకాల మలుపులు తిరగడం తెలిసిందే...  అవన్నీ... వారు.. వారు.... వారి రాజకీయ, స్వార్ధ ప్రయోజనాల కోసం చేసినవే... 
    సరే... సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ముద్ర పోవాలంటే నాదొక సలహా... సినీ పరిశ్రమలో పేరొందిన పెద్ద పెద్ద హీరోలు అందరూ... తమ తమ కుమార్తెలను హీరోయిన్లుగా ఇండస్ట్రీ లోకి తీసుకు రావాలి. అప్పుడే కాస్టింగ్ కౌచ్ అనే పదం మాసిపోవడమే కాక... కొద్దో..గొప్పో... మనమంతా కుటుంబంతో కలసి ఆనందంగా కూర్చుని చూసే సినిమాలు వస్తాయి. పాతికేళ్ల  కిందటే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ తన కూతురు మంజుల ను ఇండస్ట్రీ లోకి తీసుకు వస్తానంటే ఫాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు.. ఫాన్స్ నుంచి వ్యతిరేకతకు కారణం తమ ఆరాధ్య నటుడి కుమార్తె సినిమాల్లో పొట్టి..పొట్టి డ్రస్సులు వేసుకుని డాన్సులు చేస్తూ.. రొమాంటిక్ సీన్లు చేస్తే చూడలేమని.... అయితే ఫాన్స్ ఆలోచనా ధోరణిలో కూడా కొంత మార్పు రావాల్సి ఉంది. హీరోలు కూడా తమ కూతుళ్లను ఇండస్ట్రీ లోకి తీసుకువచ్చి ... కాస్త పద్దతి గల సినిమాలు తీయడం మొదలెడితే... నేడు ఇండస్ట్రీ లో ఉన్న చాలా రుగ్మతలకు అదే సరైన మందు కాగలదు. 
    -మానవేంద్ర 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కాస్టింగ్ కౌచ్ కు విరుగుడు మందు ఇదే..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top