Translate

  • Latest News

    30, ఏప్రిల్ 2018, సోమవారం

    హిందూ ఓట్ల కోసం రాహుల్ పాట్లు...


    హిందువుల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నానా పాట్లు పడుతున్నాడు. మన దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ సద్బ్రాహ్మణ కుటుంబంలో, ఆగర్భ శ్రీమంతుల కుటుంబంలో పుట్టారు. ఆయన హయాంలోనే ఆర్.ఎస్.ఎస్, జనసంఘ్ ఉన్నప్పటికీ, మెజార్టీ బ్రాహ్మణ కులస్తులు కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటూ వచ్చారు.  ఆ తర్వాత ఆయన తనయ ఇందిరా గాంధీ ఒక ముస్లిం ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆమె కాంగ్రెస్ పార్టీని సమర్ధవంతంగా నడిపించి ఉక్కు మహిళ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా.., బ్యాంకుల  జాతీయం, రాజభరణాల రద్దు వంటి సంచలన నిర్ణయాలతో.. పేదల గుండెల్లో ఇందిరమ్మ గా తిరుగులేని స్థానం సంపాదించడంతో బ్రాహ్మణ  సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుని ఉంది. అయితే మూడవ తరం లోకి వచ్చేసరికి రాజీవ్ గాంధీ ఒక క్రిస్టియన్, అది దేశం కానీ దేశం ఇటలీ కు చెందిన సోనియా గాంధీని వివాహ మాడారు. ఇందిర హత్య అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాన మంత్రి అయిన రాజీవ్ గాంధీ తన అనుభవ రాహిత్య నిర్ణయాల కారణంగా అధికారాన్ని కోల్పోవడం, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో హత్యకు గురైన పరిస్థితుల్లో సోనియా గాంధీ తప్పనిసరి పరిస్థితుల్లో 1998 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నారు. 
    ఇటలీ కి చెందిన ఒక క్రిస్టియన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకోవడం అనే పాయింట్ ను బి.జె.పీ దేశం లోని బ్రాహ్మణ సామాజిక వర్గంలోకి బలంగా ఎక్కించడంలో విజయవంతం అయింది. తత్ఫలితంగా 1998 నాటి నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గం వారి ఓట్లు,,, వారితో  పాటు వారిని  ఫాలో అయ్యే హిందువుల ఓట్లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మారడం ప్రారంభించాయి. అందుకే 1998 లోబి.జె.పీ  అధికారంలోకి రావడం, మితవాద నాయకుడైన వాజపేయి  ప్రధాన మంత్రి కాగలిగారు. అప్పటి నుంచి దేశంలో గత 20 ఏళ్లుగా హిందువుల ఓట్లు బి.జె.పీ కి, ప్రాంతీయ పార్టీలకు చెల్లా చెదురవుతూ వచ్చాయి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కలగూర గంప లాగా చిన్నా, చితకా పార్టీలను కూడగట్టుకుని అధికారంలోకి వచ్చిందే తప్ప సొంత బలంతో కాదు.. దీనంతటికి కారణం కాంగ్రెస్ కు హిందువుల ఓట్లు ఆశించిన రీతిలో పడకపోవడమే... సోనియా కారణంగా ఏర్పడిన క్రిస్టియన్ ముద్ర పోకపోవడమే... అప్పటికి ఆమె ప్రధాన మంత్రి పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ ను ప్రధాన మంత్రి పీఠం పై కూర్చోబెట్టిన ఆ ముద్ర వీడలేదు. రాహుల్ గాంధీ కంటే దేశ  ప్రజల్లో ప్రియాంక గాంధీకి ఎక్కువ ఆకర్షణ ఉన్నా ఆమె కూడా మళ్ళీ క్రిస్టియన్ ను  పెళ్లి చేసుకోవడంతో సోనియా ఆమెను రాజకీయంగా కీలక స్థానంలో కూర్చోబెట్టలేదు. ప్రత్యర్ధులు పప్పు అని రాహుల్ పై ఎన్ని నిందలు వేసినా రాహుల్ కే  ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది ఈ క్రిస్టియన్ ముద్ర పోవాలనే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు హిందువులను ఆకర్షించడానికి నానా పాట్లు పడుతున్నారు. 
    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే రాహుల్ ఇందుకు శ్రీకారం చుట్టారు. గుజరాత్ లో కొంతవరకు కృతకృత్యులయ్యారు. కర్ణాటక ఎన్నికల్లో లింగాయత్ లకు రిజర్వేషన్లు ప్రకటించి ఆ వర్గాన్ని బి.జె.పీ నుంచి తమ వైపు ఆకర్షించగలిగారు. రెండు రోజుల క్రితం కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ విమానం లో సాంకేతిక లోపం ఏర్పడి 8 వేల అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా నెల వైపు దూసుకు వెళ్ళింది. పైలెట్  అప్రమత్తతతో  ప్రమాదం నుంచి బయట పడ్డ అనంతరం రాహుల్ విలేకరులతో మాట్లాడుతూఇక అయిపోయినట్టే అనుకున్నానని,  ఆ సమయంలో నాకు ఆది దేవుడు శివుడు గుర్తొచ్చాడని, అదృష్టం బాగుంది బతికి బయటపడ్డానని, అందుకే కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత మానస సరోవర యాత్రకు వెళదామనుకుంటున్నటు చెప్పారు. ఈ మాటల ద్వారా రాహుల్ రాజకీయంగా పరిణితి చెందినట్టు కనిపిస్తోంది. ప్రమాదాన్ని కూడా తానూ హిందువులకు దగ్గరవడానికి ఈ విధంగా మరల్చుకున్నాడు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి దూరమైన హిందువుల ఓట్లను తిరిగి దగ్గర చేసుకోవడానికి రాహుల్ గాంధీ పాపం... నానా పాట్లు పడుతున్నాడు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: హిందూ ఓట్ల కోసం రాహుల్ పాట్లు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top