Translate

  • Latest News

    7, మే 2018, సోమవారం

    హాట్సాఆఫ్ టు దాచేపల్లి...


    నాడు దూబగుంట...నేడు దాచేపల్లి.... అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1990 వ దశకంలో సారా వ్యతిరేక ఉద్యమానికి నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామం నాందీ వాచకం పలికింది. అక్కడ రగిలిన నిప్పురవ్వకు అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఉదయం పత్రికాధిపతిపై ఉన్న వ్యక్తిగత కక్షతో ఈనాడు అధినేత రామోజీరావు భుజాన వేసుకోవడంతో అది రాష్ట్రవ్యాప్తంగా మహోద్యమంగా రూపుదాల్చింది. దాదాపు పాతికేళ్ల తర్వాత  గుంటూరు జిల్లా దాచేపల్లి లో ఒక 9 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారానికి నిరసనగా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చింది. ఈ ఘటనకు ముందు... ఆ తర్వాత కూడా రాష్ట్రంలో చాలాచోట్ల ఈ విధమైన అత్యాచారాలు జరిగాయి...జరుగుతూనే ఉన్నాయి. కానీ... దాచేపల్లి గ్రామస్తులు కుల, మాట, పార్టీలకు అతీతంగా ఐక్యంగా మూడు రోజులపాటు చేసిన ఉద్యమంతో ప్రభుత్వం కదలివచ్చింది. జిల్లా ఎస్.పీ స్వయంగా 48 గంటల పాటు దాచేపల్లి లోనే మకాం వేశారంటేనే ఆందోళన ఉధృతి అర్ధం చేసుకోవచ్చు. హాట్సాఆఫ్ టు దాచేపల్లి గ్రామస్తులు. 
    నాయకురాలు నాగమ్మ నడయాడిన నేల... 
    అది నాయకురాలు నాగమ్మ నడయాడిన నేల... అందుకే అక్కడి మహిళలలో అంత పోరాట స్ఫూర్తి. గురజాల రాజ్యాన్ని పరిపాలించిన నలగామ రాజు వద్ద నాగమ్మ మంత్రిగా ఉండేది. గురజాల  అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమైన దాచేపల్లి మండలం లోని గామాలపాడు గ్రామంలో నాడు నాగమ్మ హయాంలో కట్టించిన గుడి ఇప్పటికి ఉంది. నాడు నాయకురాలు నాగమ్మ నడయాడిన నేల కాబట్టేనేమో... దాచేపల్లి మహిళలు ఒక్కొక్కరు ఒక నాగమ్మ అయ్యారు... ఒక్కొక్కరు ఒక కాళిక అయ్యారు... ఒక్కొక్కరు... ఒక కనకదుర్గ అయ్యారు... 
    (నోట్ : పైన చిత్రంలో దాచేపల్లి లోని నాగమ్మ విగ్రహం చూడవచ్చు)
    మన చాప కిందకు నీరు వస్తే కానీ అన్నట్టుగా కాకుండా... పక్కింట్లో కదా జరిగింది మనకెందుకులే అని అనుకోకుండా... ఆ బిడ్డకు జరిగింది.. మన బిడ్డకే అన్నట్టుగా గ్రామం... గ్రామం మొత్తం కదలివచ్చి స్పందించిన తీరు అమోఘం...అద్వితీయం..ఆదర్శనీయం... రాష్ర్ట్రం మొత్తానికి ఇది ఒక ఆదర్శం కావాలి... భవిష్యత్తులో ఎక్కడ ఈ మగాడు... ఏ ఆడపిల్ల మీద చెయ్యి వేసిన ప్రజలు దాచేపల్లి ని ఆదర్శంగా తీసుకుని అదే విధంగా స్పందించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలకు తోలు మందం కదా... అంత  గొడవ చేస్తే తప్ప స్పందించవు... లేదా మిగతా వందలాది ఘటనల లాగే అవి కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. సో... దాచేపల్లి మనకు ఆదర్శం... ఒన్స్ అగైన్ హాట్సాఆఫ్ టు దాచేపల్లి... 




















































    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: హాట్సాఆఫ్ టు దాచేపల్లి... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top