Translate

  • Latest News

    9, మే 2018, బుధవారం

    ఆ స్వరం... బాబు పాలిట శనీశ్వరం...


    ఆ స్వరం... బాబు పాలిట శనీశ్వరం...  ఇప్పటి దాకా చంద్రబాబు ఏమి మాట్లాడినా జనం ఆయన మీద నమ్మకంతో ఉండబట్టి... ఆయన స్వరం విని  నాదస్వరానికి నాగుపాము తలూపినట్టుగా ప్రజలు తలూపారు. ఎందుకంటే...ఆయన నిప్పు అనే భ్రమలో ఉండబట్టి... కానీ ఈ నాలుగేళ్ల తాజా పాలనలో బాబు గారు నిప్పు కానే కాదు... అవినీతి జలం తో తడిసి తుప్పుగా మారిపోయాడని ప్రజలకు అనేకానేక సంఘటనల ద్వారా క్షుణ్ణంగా అర్ధమైపోయింది. ఆయన చేసిన పాపం పండి గుమ్మడిపండులా భళ్ళున బద్దలయ్యే దశలో ఉంది. తెలంగాణలో తన ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడం కోసం... రేవంత్ రెడ్డి ఏ 1 గా ఉన్న ఓటుకు నోటు కేసు ఫైల్ ను కేసీఆర్ దుమ్ము దులిపాడు. తీరా ఇప్పుడు స్వరం టెస్ట్ 90 శాతం మ్యాచ్ అయి మొత్తానికి చంద్రబాబు ఏ 1 నిందితుడు అయ్యేటట్టు ఉన్నాడు. సాధారణంగా ఈ తరహా పరీక్షల్లో 60 నుంచి 70 శాతం ట్రాక్స్, మాడ్యూల్స్ సరిపోలుతాయి. కానీ చండీగఢ్ లోని  నేర న్యాయ పరిశోధన సంస్థ నిర్వహించిన వాయిస్ శాంపిల్ పరీక్షలో దాదాపు 90 శాతం సరిపోలినట్టు తెలుస్తోంది. ఈ కేసులో అత్యాధునిక వాయిస్ రికార్డు పరీక్షా పరికరాలను ఉపయోగించినట్టు తెలుస్తోంది. కేంద్ర ఫోరెన్సిక్ లాబరేటరీ కి చెందిన నలుగురు సీనియర్ నిపుణులు పరీక్షా ఫలితాలను స్పష్టంగా పరిశీలించారు. ఈ తరహా స్పష్టత గతంలో జరిగిన ఏ శాస్త్రీయ పరిశోధనల్లోనూ లేదని ఆ సంస్థ వెల్లడించింది.
     రాష్ట్ర ఫోరెన్సిక్ లాబొరేటరీలో ఉన్నత హోదాలో పనిచేసి, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఓ అధికారి కూడా ఈ నివేదికను పరిశీలించి పరీక్ష పక్కాగా ఉందని ధృవీకరించడంతో చంద్రబాబు గుండెల్లో గుబులు మొదలయింది. అందుకే ఆ మధ్య ప్రజలే నాకు రక్షణ కవచంలా ఉండాలని ఓ మాట వేసి ఉంచాడు... ఎంత అయినా మన బాబు గారు తెలివిగల వాడు కదా... కానీ ఒకటే సందేహం... ప్రజలకు ప్రభువు రక్షణ కవచంలా వ్యవహరిస్తే... ఆ ప్రభువుకు ఏదయినా ఆపద వస్తే ప్రజలు కూడా రక్షణ కవచంలా నిలబడతారు. ప్రభువే కాదు... ప్రజల కోసం నిజాయితీగా పనిచేసిన అధికారులను ప్రభుత్వం అర్ధంతరంగా బదిలీ చేసిన సందర్భాల్లో కూడా గతంలో రాష్ట్రంలో పలుసార్లు ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ పల్లె నుంచి పట్నం దాకా... ఊరి చెరువులో మట్టి కాడనించి రేవులో ఇసుక దాకా... అంతేకాదు రాజధాని కోసమని సామాన్యుల పొలాలు తీసుకుని  చివరకు రోడ్ల కోసమని ఉన్న ఇల్లు కూడా తీసుకుని, నడిరోడ్డు పాల్జేసి, ప్రజల ఆస్తులను కొల్లగొట్టిన గజదొంగకు  ప్రజలు ఎంతవరకు రక్షణ కవచంగా నిలబడతారనేదే సందేహం... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఆ స్వరం... బాబు పాలిట శనీశ్వరం... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top