Translate

  • Latest News

    8, ఏప్రిల్ 2018, ఆదివారం

    దెబ్బతిన్న రాజకీయ సమతుల్యత


    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు వివిధ సామాజికవర్గాల మధ్య ఒక సమతుల్యత (బ్యాలెన్స్) మెయింటైన్ అవుతూ ఉండేది. ముఖ్యంగా ప్రధాన సామాజిక వర్గాలైన రెడ్డి, కమ్మ, ఆ తర్వాత వెలమ, కాపు, బి.సి వర్గాలైన గౌడ, యాదవ, మాల, మాదిగ, ముస్లిం ఇలా ఇలా... వివిధ సామాజిక వర్గాలకు ఆయా నిష్పత్తుల్లో ఎంతో కొంత పరిపాలనా భాగస్వామ్యం ఉండేది. 2014 లో దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయాక కోస్తా 9 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలతో కలసి 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ఆ రాజకీయ సమతుల్యత దెబ్బతింది. ఇది రాష్ట్రంలో సామాజిక అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది. కోస్తా 13 జిల్లాల్ని శాసించేవి కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కమ్మ సామాజికవర్గమే అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా బలంగా ఉన్న కాపులు ఎన్నికల్లో గెలుపోటములను శాసిస్తూన్నారు. దీంతో వారు కూడా ఏ.పీ లో సి.ఎం కుర్చీ ని అధిష్టించాలని కోరుకుంటున్నారు. అయితే ఆ సామాజిక వర్గం నుంచి వంగవీటి మోహన రంగా తర్వాత రాజకీయ రంగంలో నుంచి వచ్చిన వారిలో రాష్ట్రమంతా ప్రభావం చూపగల నాయకుడు ఎవరు బలంగా తయారు కాలేదు. ముద్రగడ ఆ స్థానాన్ని భర్తి చేయలేకపోయారు. సినిమా రంగం నుంచి వచ్చిన చిరంజీవి పార్టీ పెట్టి మూన్నాళ్ల ముచ్చట చేశారు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జన సేన పార్టీ పెట్టి సినిమా షెడ్యూల్ లా ఆయన డైరీ లో రాసుకున్న డేట్ కి బయటకు రావడం, రిహార్సల్ చేసిన డైలాగులు ఆవేశంగా అప్పచెప్పడం, మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం చేస్తున్నారు. రాజకీయాలకు ఇలాంటి వ్యక్తి అసలు పనికి రాడు. సినిమాలు వదిలేసి పూర్తిగా రాజకీయాల్లోకి వస్తానన్న మనిషి ప్రత్యేక హోదా మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే  ఓ పక్క జగన్ పార్టీ ఎం.పీ లు రాజీనామా చేసి, ఆమరణ దీక్షకు కూరుచుంటే... ఈయన ఇక్కడ పాదయాత్ర చేసి రోడ్ షో చేస్తే చాలదు. ఢిల్లీ వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించాలి. తన పార్టీ శ్రేణులను కూడా వారికి సంఘీభావం ప్రకటించమని చెప్పాలి. ఎంతో చరిత్ర గల వామ పక్షాలు పవన్ వెనకాల పది పోవడం వారి రాజకీయ దౌర్బల్యానికి నిదర్శనం. కమ్యూనిస్టులకు జగన్ తో కలసి చేయడం ఇష్టం లేకపోతె సి.పీ.ఐ, సి.పీ.ఎం కలసి చేయవచ్చు కదా... పవన్ వెనకాల పడి పోవడం ఎందుకు. మహారాష్ట్ర లో రైతు ఉద్యమం లా వీరు ఒంటరిగా చేయవచ్చు కదా. చిత్తశుద్ధితో చేస్తే ఏదయినా   విజయవంతం అవుతుందని మహారాష్ట్ర కమ్యూనిస్టులు నిరూపించారు. పవన్ లాంటి నిలకడ లేని వ్యక్తి వెనకాల వెళితే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనన్న సంగతి కమ్యూనిస్టులు గ్రహించాలి. 
    ఉడుకుమోత్తనం ఎందుకు..?
    జగన్ పాదయాత్ర జరిపి వెళ్లిన ప్రదేశాల్లో వచ్చిన జనాల్ని చూసి తెలుగుదేశం వాళ్ళు ఉడుకుమోత్తనంతో, ఉక్రోషం  పట్టలేక పసుపు నీళ్లు చల్లడం, జగన్ దిష్టి బొమ్మలు తగలబెట్టడం వారికి ప్రజలలో ఇంకా మైనస్ అవుతుందని గ్రహించాలి. దమ్ముంటే జగన్ ఎక్కడైతే మీటింగ్ పెట్టాడో... వాళ్ళు కూడా అక్కడే మీటింగ్ పెట్టి జన సమీకరణ చేసి మాకూ  జనం వచ్చారని చెప్పుకోవాలి తప్ప ఇటువంటి చర్యలు తగదు. పైగా గుంటూరు జిల్లాలో కమ్మ సామాజికవర్గం అధికంగా ఉండే తెనాలి బెల్ట్ లో నారా కోడూరు, అంగలకుదురు వంటి చోట్ల ఇలా జరగడం... ఆ సామాజికవర్గం పట్ల మిగతా సామాజిక వర్గాల్లో మరింత ద్వేషాన్ని రగిలించే ప్రమాదం కూడా ఉంది. 
    -మానవేంద్ర 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: దెబ్బతిన్న రాజకీయ సమతుల్యత Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top