Translate

  • Latest News

    6, ఏప్రిల్ 2018, శుక్రవారం

    మహానుభావులు జగ్జీవన్ రామ్, పూలే, అంబేడ్కర్... చంద్రబాబు


     జగ్జీవన్ రామ్, పూలే, అంబేడ్కర్...వీరంతా మహానుభావులు... ఓకే. ఇప్పుడు వారి కోవలోకి చంద్రబాబు కూడా చేరారు మీకు తెలుసా... ఈ విషయం జగ్జీవన్ జయంతి సభలో ఆయన స్వయంగా చెప్పారు. అదెలాగంటారా... వినండి. విజయవాడ ఏ కన్వెంక్షన్ సెంటర్ లో జగ్జీవన్ రామ్ జయంతి సభలో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో అందరూ మహానుభావులు పుట్టారు. జగ్జీవన్ రామ్ (ఏప్రిల్ 5), పూలే (ఏప్రిల్ 11), అంబేడ్కర్(ఏప్రిల్ 14) అని చెబుతుండగా... వేదిక మీద ఉన్న తెలుగుదేశం నాయకులు సర్.. మీరు కూడా ఏప్రిల్ నెలలోనే పుట్టారు అని అందించారు. వెంటనే చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుకుంటు మా వాళ్ళు చెబుతున్నారు నేను కూడా ఇదే నెలలో (ఎప్రిల్ 20) పుట్టానని... అంటూ వెంటనే ఆవేశంగా నేను సైతం ఆ మహానుభావుల్లాగా నా జీవితాన్ని ప్రజలకోసమే అంకితం చేస్తాను... అంటూ ఓ బరువైన డైలాగ్ చెప్పారు... సో ఎవరు అవునన్నా... కాదన్నా...  జగ్జీవన్ రామ్, పూలే, అంబేడ్కర్...తో పాటు చంద్రబాబు కూడా మహానుభావుడే... మీరు ఒప్పుకుని తీరాలసిందే...లేదంటే మీ తలలు వేయి వ్రక్కలు అవును గాక... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మహానుభావులు జగ్జీవన్ రామ్, పూలే, అంబేడ్కర్... చంద్రబాబు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top