Translate

  • Latest News

    5, ఏప్రిల్ 2018, గురువారం

    పెరిగిన ప్రజాచైతన్యం..దిగి రాక తప్పని ప్రభుత్వం

    ఇటీవల దేశంలో  రెండు అంశాలు అగ్గి రాజేసాయి . ఆయా వర్గాల నుంచి వచ్చిన  ప్రతిఘటన కు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇందులో ఒకటి ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీ చట్ట సడలింపునకు సంబంధించింది  కాగా మరొకటి ఫోర్త్  ఎస్టేట్ గా పిలుచుకునే  మీడియా  నకిలీ వార్తలు పుట్టించినా, ప్రచారం చేసినా  జర్నలిస్టుల గుర్తింపును రద్దు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే  ఈ రెండు  అంశాలపై వెల్లువెత్తిన  నిరసన కు ప్రభుత్వం దిగివచ్చింది. 
    1955లో దేశంలో అంటరానితనం నిషేధిత చట్టం అమల్లోకి వచ్చింది. అదే 1974లో పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మారింది. 1989లో ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంగా రూపాంతరం చెందింది. వర్ణ వ్యవస్థ ఆధిపత్యంగల భారత్‌లో ఆశించిన మార్పు రాకపోవడంతో చట్టాన్ని సవరిస్తూ వచ్చారు. ఇప్పటివరకు చట్టాన్ని కఠినతరం చేస్తూ రాగా, ఇప్పుడు సుప్రీం కోర్టు దాన్ని సడలించింది. చట్టం దుర్వినియోగం అవుతుందన్న కారణంగా ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొంది. రాజ్యాంగంలోని 498ఏ, ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌లాఫుల్‌ యాక్టివిటీ చట్టాలు ఎస్సీ,ఎస్టీల చట్టంకన్నా ఘోరంగా దుర్వినియోగం అవుతున్నా పట్టించుకోకుండా సుప్రీం కోర్టు దాన్ని సడలించడాన్ని  దళిత సంఘాల నుంచి తీవ్ర  నిరసన వ్యక్తమైంది  దేశ వ్యాప్తంగా భారత్ బంద్‌  నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పుపై రివ్యూకు వెళుతున్నట్టు స్పష్టం చేసింది.
     ఇక మరో అంశం  నకిలీ వార్తలు పుట్టించినా, ప్రచారం చేసినా  జర్నలిస్టుల గుర్తింపును రద్దు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విలేకరుల గుర్తింపునకు సంబంధించిన నియమావళిని సవరరించింది. నిబంధనల ప్రకారం.. నకిలీ వార్తలను ప్రచురించడం, ప్రసారం చేసినట్లు నిర్ధారణ అయితే సదరు జర్నలిస్టు గుర్తింపును రద్దు చేస్తారు.తొలి ఉల్లంఘన కింద ఆరు నెలల పాటు, రెండో సారీ అదే పని చేస్తే సంవత్సరం పాటు, మూడోసారీ తప్పు చేస్తే గుర్తింపును శాశ్వతంగా రద్దు చేయనుంది ప్రభుత్వం. ఫేక్‌ న్యూస్‌పై వచ్చే ఫిర్యాదులను పీసీఐ, ఎన్‌బీఏలు పరిశీలించి 15 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తాయని ప్రభుత్వం వివరించింది. ఈ అంశంపై జర్నలిస్ట్ సంఘాలు ,మేధావుల నిరసనల మధ్య  ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అంశాలు వేర్వేరు అయినప్పటికి  పెరిగిన ప్రజా చైతన్యానికి ప్రతీక ఇది. భిన్న స్వరాలు వినిపిస్తేనే కదా భావప్రకటన స్వేచ్చ వికసించేది. 



    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పెరిగిన ప్రజాచైతన్యం..దిగి రాక తప్పని ప్రభుత్వం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top