Translate

  • Latest News

    4, ఏప్రిల్ 2018, బుధవారం

    పెట్రోల్, డీజిల్ ధరలను జి.ఎస్.టి పరిధి లోకి తేవాలి


    దేశంలో చాలా సమస్యలున్నాయి. విభిన్న వర్గాల వారు తమ తమ సమస్యలపై నిత్యం ఏదో ఒక రూపంలో పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అయితే అందరికి కామన్ సమస్య ఒకటి ప్రధానమైనది ఉన్నా... దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. 2014 లో మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు హద్దు, అదుపు లేకుండా పెరిగిపోయాయి. పైగా ఏ రోజు కా రోజు ధరలు అంటూ ఎంత పెరుగుతుందో కూడా తెలియకుండా పెంచేస్తున్నారు. తడి గుడ్డతో గొంతు కోయడం అంటే ఇదే... డిసెంబర్ 1 వ తేదీన 67 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఇప్పడు 80 రూపాయలు అయిందనే సంగతి ఎవరన్నా పని గట్టుకుని చెబితే తప్ప మనం గుర్తించలేని విధంగా మంకు స్లో పాయిజన్ ఎక్కించినట్టుగా నాలుగు నెలల్లో లీటర్ కు 13 రూపాయలు పెంచేసినా దేశ  జనాభాలో ఉలుకు పలుకు లేదు. ఆలా మనల్ని మెస్మరైజ్ చేసి మోడీ, అమిత్ షా లు మనల్ని ఆడిస్తున్నారు.  జి.ఎస్.టి చట్టం తెచ్చి ధరలన్నీ తగ్గించేస్తానని డంబాలు పలికిన మోడీ పెట్రోల్, డీజిల్ ని ఇంతవరకు జి.ఎస్.టి పరిధి లోకి తేకుండా దొంగ నాటకాలు ఆడుతున్నాడు. 
    జి.ఎస్.టి పరిధి లోకి తెస్తే ఏ వస్తువు కయినా మాక్సిమం 28% కన్నా ఎక్కువ టాక్స్ విధించడానికి వీల్లేదు. కానీ కేంద్రం చమురు ధరలను జి.ఎస్.టి పరిధి లోకి తేకపోవడం వలన మనం 100% పైనే పన్ను కడుతున్నాం. ఒక లీటర్ పెట్రోల్ దిగుమతికి, ఉత్పత్తికి టోటల్ గా  అయ్యే ఖర్చు కేవలం 38 రూపాయలు. దేనికి కేంద్రం ఒక 20 రూపాయలు, రాష్ట్రం ఒక 20 రూపాయలు పన్ను వేసి మనకు 78 నుంచి 80 రూపాయలు అమ్ముతోంది. అంటే మనం  పోయించుకునే  ప్రతి లీటర్ కు కేంద్రానికి 20, రాష్ట్రానికి 20 చొప్పున 40 రూపాయలు పన్ను కడుతున్నాం.  సుమారు 38 రూపాయలు ఉత్పత్తి ఖర్చు అవుతున్న వస్తువుకు 80 రూపాయలు చెల్లిస్తున్నాం. అంటే 100 శాతం కన్నా ఎక్కువ పన్ను చెల్లిస్తున్నాం. అదే చమురు ధరలను కూడా జి.ఎస్.టి పరిధిలోకి తెస్తే మాక్సిమం 28% కంటే టాక్స్ వేయడానికి వీలులేదు. అప్పుడు మనకు లీటర్  పెట్రోల్ 50 రూపాయలకే లభిస్తుంది. కానీ ఆలా జరగనీయకుండా మోడీ కార్పొరేట్లకు మేలు చేసేలా వ్యవహరిస్తూ  ప్రజల సొమ్ము అంతా దోచుకుని  దొంగలు..దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు దేశాన్ని, దెస ప్రజల సొమ్మును పంచుకుంటున్నారు. 
     ఇప్పుడు దేశ  ప్రజలంతా పెట్రోల్, డీజిల్ ధరలను జి.ఎస్.టి పరిధి లోకి తేవాలంటూ అర్జెంట్ గా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో చమురు ధరలను జి.ఎస్.టి లోకి తెస్తామని రాతపూర్వక హామీ ఇచ్చే పార్టీకే ఓట్లు వేస్తామని చెప్పాలని భిన్నస్వరం డిమాండ్ చేస్తోంది. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు షేర్ చేసి, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ఉద్యమం రాజుకునేలా చేయాలని భిన్నస్వరం అభిలషిస్తోంది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పెట్రోల్, డీజిల్ ధరలను జి.ఎస్.టి పరిధి లోకి తేవాలి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top