Translate

  • Latest News

    2, ఏప్రిల్ 2018, సోమవారం

    బాలయ్య మామకు లోకేష్ అల్లుడి వెన్నుపోటు..?




    తండ్రి బాట లోనే కొడుకు లోకేష్ కూడా నడుస్తున్నాడా... జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. చంద్రబాబు తన మామ ఎన్.టీ.ఆర్ కు వెన్నుపోటు పొడిచి సి.ఎం సీటు లాగేసుకున్నట్టే... ఇప్పుడు చంద్రబాబు కొడుకు లోకేష్ కూడా తన మామ బాలకృష్ణ నుంచి హిందూపురం ఎం.ఎల్.ఏ సీటు లాగేసుకుంటున్నాడా...

     వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేయడానికి లోకేష్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పైగా బాలకృష్ణను  తెలంగాణా కు పరిమితం చేయాలని కుట్ర చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. తెలంగాణా లో ఒక బి.సి నాయకుడిని ముందు పెట్టుకుని, బాలకృష్ణ వెనుక ఉండి  అక్కడ పార్టీని బలపరచాలని ఉచిత సలహా ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. 2014 లో హిందూపురం నుంచి ఎం.ఎల్.ఏ గా గెలిచాక ఏ.పీ రాజకీయాల్లో చురుకుగా పనిచేయాలని బాలకృష్ణ ఆశ పడ్డాడు. అయితే ఆయన రాజకీయాల్లో చురుకుగా ఉంటె ఎప్పటికి అయినా తనకు, తన కొడుక్కు ప్రమాదమని గ్రహించిన చంద్రబాబు... బాలకృష్ణకు తన కొడుకుతో చెక్ పెట్టించబోతున్నాడు. ఇంతకు ముందే లోకేష్ తాను వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు కూడా. అల్లుడి నుంచి ఈ అనూహ్య వెన్నుపోటు తో మనసు వికలమైన బాలయ్య ఏకంగా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుని సినిమాలకు పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో జూనియర్ ఎన్.టీ.ఆర్ ను 2009 ఎన్నికల్లో వాడుకుని ఆ తరువాత  లోకేష్ కు ఎక్కడ మొగుడు అవుతాడో అని కరివేపాకులా తీసి పారేసిన విషయం తెలిసిందే. జీన్స్ ఎక్కడికి పోతాయి మరి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బాలయ్య మామకు లోకేష్ అల్లుడి వెన్నుపోటు..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top