Translate

  • Latest News

    21, మే 2018, సోమవారం

    బెంగళూర్ వేదికగా బి.జె.పీ వ్యతిరేక కూటమి ఆవిర్భావానికి నాంది


    బెంగళూర్  బి.జె.పీ వ్యతిరేక కూటమి ఆవిర్భవించదానికి నాంది కానుంది.  ఈ నెల 23 వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రి గా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి దేశంలో బి.జె.పీ కి వ్యతిరేకంగా పనిచేస్తున్న వివిధ రాజకీయ పార్టీల అధినేతలందరిని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో పాటు జాతీయ స్థాయిలో బి.జె.పీ కి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రాంతీయ పార్టీల నాయకులు మమతా బెనర్జీ, మాయావతి, అభిలేష్ యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్, కె.సి.ఆర్, చంద్రబాబు నాయుడు, వామపక్షాల నేతలు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో బి.జె.పీ ని ఓడించడానికి చేపట్టాల్సిన వ్యూహం, బి.జె.పీ కి వ్యతిరేకంగా అందరూ కలసికట్టుగా నడవాల్సిన అవసరం గురించి ప్రధానంగా చర్చించనున్నారు. కర్ణాటక లో కాంగ్రెస్ తనకు 78 సీట్లు వచ్చినా, 38 సీట్లు వచ్చిన కుమారస్వామి కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సమయ స్ఫూర్తి కి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.  మున్ముందు  కూడా కాంగ్రెస్ ఈ విధంగానే ప్రాంతీయ పార్టీలతో కలసిమెలసి వ్యవహరిస్తే బి.జె.పీ ఆట కట్టించవచ్చని భావిస్తున్నారు. ఇచ్చిన స్పూర్తితో భవిష్యత్తులో ఇదే పద్ధతిలో జాతీయ స్థాయిలో పనిచేయాలని గట్టిగా నిర్ణయం తీసుకోనున్నారు. ఏదేమైనా... బుధవారం బెంగళూర్ లో బి.జె.పీ వ్యతిరేక పక్షాల కలయిక దేశంలో ఒక సరికొత్త రాజకీయానికి నాంది పలకనుంది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బెంగళూర్ వేదికగా బి.జె.పీ వ్యతిరేక కూటమి ఆవిర్భావానికి నాంది Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top