Translate

  • Latest News

    20, మే 2018, ఆదివారం

    కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..?


    పవన్ అభిమానుల్లో చిగురిస్తున్న  ఆశలు... 

    కర్ణాటక రాజకీయాలు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంగొత్త ఆశలు చిగురింపచేశాయి. 2019 లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక సీన్ ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారంటున్నారు. ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో జనసేన ప్రధాన పార్టీలతో సమానంగా ప్రభావం చూపించగలదని, మిగతా 10 జిల్లాల్లో కూడా ప్రధాన పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపించడం ఖాయమని చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో గ్యారంటీగా గెలుస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉన్నప్పటికీ చివరకు 78 దగ్గరే ఆగిపోయిందని... బి.జె.పీ కి ఓట్లు తక్కువ వచ్చినా సీట్లు ఎక్కువ వచ్చి 104 దాకా వచ్చి ఆగిందని, జె.డి.ఎస్ కు 38 రావడంతో చివరకు హంగ్ ఏర్పడిందని, వచ్చే ఏడాది ఏ.పీ లో ఇదే సీన్ రిపీట్ అవడం ఖాయమని పవన్ అభిమానులు అంటున్నారు. 
    కర్ణాటకలో కాంగ్రెస్ లాగానే ఇక్కడ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ముందు దాకా గెలుపు ఖాయం అనేటట్టు గానే ఉంటుందని, చివరలో చంద్రబాబు పోల్ మానేజిమెంట్ తో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ మళ్ళీ 70 ల దగ్గర ఆగిపోతుందని, తెలుగుదేశం కూడా 75 సీట్లు దాకా గెలుచుకుంటుందని, జన సేన 30 సీట్లు గెలుచుకుని కర్ణాటక లో జె.డి.ఎస్ లాగా క్రియాశీలక పాత్ర పోషించడం ఖాయమని వారంటున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ను  ముఖ్యమంత్రి పదవికి ఎవరు సపోర్ట్ చేస్తే వారికె మద్దతు ఇస్తామని డిమాండ్ చేసే అవకాశం తమ చేతిలో ఉంటుందని  చెబుతున్నారు. జగన్ వేరొకరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి అంగీకరించకపోయినా పరిస్థితులను బట్టి చంద్రబాబును మళ్ళీ సి.ఎం కానీయకుండా అడ్డువేయాలంటే జనసేన డిమాండ్ కు తలొగ్గక తప్పదని... ఇప్పుడు కర్ణాటక లో కాంగ్రెస్ పరిస్థితే అప్పుడు ఇక్కడ జగన్ కు వస్తుందంటున్నారు. కుమారస్వామి లాగానే పవన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెబుతున్నారు. విచిత్రమేమిటంటే కుమారస్వామి కూడా సినీ ఇండస్ట్రీ తో సంబంధం ఉన్న వ్యక్తే.. ఆయన సినీ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. సో... పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశలు ఎంతవరకు నిజమవుతాయో  చూడాలంటే వచ్చే అసెంబ్లీ  ఎన్నికల దాకా వేచి చూడాలసిందే. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top