Translate

  • Latest News

    19, మే 2018, శనివారం

    బాండ్లు సరే... ముందు శ్వేత పత్రం విడుదల చేయండి


    ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రూ. 2 వేల  కోట్ల విలువ చేసే బాండ్లు ఈ నెలాఖరు కల్లా జారీ చేసి, మార్కెట్లో విడుదల చేయాలని సి.ఆర్.డి.ఏ నిర్ణయించింది. ఈ బాండ్లకు  రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందట. రాజధాని వ్యవహారాలపై శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సి.ఆర్.డి.ఏ కమిషనర్ శ్రీధర్, అమరావతి డెవలప్ మెంట్ కమిటీ అధికారులతో సమావేశాలు   తీసుకున్నారు. ప్రాధమికంగా రూ. 2 వేల  కోట్లకు బాండ్లు విడుదల చేయనున్నట్టు  సి.ఆర్.డి.ఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. అయితే ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేకంగా బాండ్లు విడుదల చేయాలని సి.ఎం ఆయనకు సూచించారు. ఈ నెల 22 నాటికి వీటికి సంబంధించిన క్రెడిట్ రేటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఈ బాండ్లకు ఏ. ఏ ప్లస్, ఏ ఏ కేటగిరి లలో క్రెడిట్ రేటింగ్ వచ్చే అవకాశం ఉందని  సి.ఆర్.డి.ఏ కమిషనర్ తెలిపారు. రాజధానిలో వివిధ ప్రాజెక్టులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపునకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. 
    ఓ.కే... అంతా బాగానే ఉంది. కానీ ఓ చిన్న మాట  బాండ్లు విడుదల చేసే ముందు ఈ నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం కోసం... ఎవరెవరు... ఎంతెంత విరాళాలు ఇచ్చారు... వాటిని వేటికి వేటికి ఖర్చు పెట్టారు.... టీ డీ.పీ తోక పత్రిక ఆంధ్ర జ్యోతి  పాఠకుల నుంచి రాజధాని విరాళాలు పేరుతొ ఎంత కలెక్ట్ చేసింది... ఆ విరాళాలు ఎవరికి అప్పచెప్పింది... వగైరా... మొత్తం శ్వేతపత్రం విడుదల చేసి తన నిజాయితీ  నిరూపించుకోవాలి. మార్కెట్ లోకి వస్తున్నప్పుడు ఏ కంపెనీకి అయినా.. సంస్థ కి అయినా  విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం కదా సారూ..
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బాండ్లు సరే... ముందు శ్వేత పత్రం విడుదల చేయండి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top