Translate

  • Latest News

    18, మే 2018, శుక్రవారం

    భళా... సుప్రీం... భళా...


    నిన్న మొన్నటి దాకా సుప్రీం కేంద్రం చేతిలో కీలుబొమ్మ అనే అపప్రధ ఉండేది. ఇటీవల సుప్రీం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సుప్రీం స్థాయిని నిలబెట్టి, దాని ఇండివిడ్యువాలిటీని కాపాడుతున్నాయి. ప్రస్తుతం దేశాన్ని పట్టి కుదుపుతున్న కర్ణాటక పోస్ట్ ఎలక్షన్ పాలిటిక్స్ (ఎన్నికల అనంతర రాజకీయ పరిణామాలు) నేపథ్యంలో సుప్రీం కేంద్రం అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, జె.డి.ఎస్ పిల్ ను వాదనలకు స్వీకరించడమే కాక... బల నిరూపణకు గవర్నర్  15 రోజులు గడువు ఇవ్వడంపై ఆక్షేపించడం గమనార్హం. అంతేకాక 24 గంటలు గడువు చాలని, శనివారం సాయంత్రం 4 గంటలకు బల పరీక్షకు హాజరు కావాలని ఇంటీరియర్ ఆర్డర్ ఇవ్వడం  సంచలనాత్మకం. కాంగ్రెస్, జె.డి.ఎస్ ల పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ భూషణ్, జస్టిస్ బాబడే ల తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

    సుప్రీం కోర్టులో శుక్రవారం ఉదయం 10.30 నుంచి 11.30  గంటల వరకు వాదోపవాదనలు జరిగిన అనంతరం సుప్రీం ఈ విధంగా ఆదేశించిన నేపథ్యంలో బలాన్ని నిరూపించుకోవడానికి తాము సిద్ధమని కాంగ్రెస్, జె.డి.ఎస్ ప్రకటించగా... బి .జె.పీ తరపు న్యాయవాది రోహత్గి  మాత్రం రేపటికి అంటే తాము సిద్ధంగా  లేమని తమకు కనీసం వారం రోజులు గడువు ఇవ్వమని అభ్యర్ధించారు.  కానీ సుప్రీం అందుకు సమ్మతించలేదు.  సుప్రీం we can not give more time. అని స్పష్టం చేసింది. బల పరీక్ష సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరగాలని బి.జె.పీ చేసిన అభ్యర్ధనను కూడా కోర్ట్ తిరస్కరించింది. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన బల పరీక్ష జరగాలని కోర్ట్ ఆదేశించినట్టు కాంగ్రెస్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ జరుగుతుందని చెప్పారు. అంతేకాక ముఖ్యమంత్రిగా యెడ్యూరప్ప ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదని కూడా ఆదేశించింది.  ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకేయాలు మాంచి రసకందాయంలో పడ్డాయి.మొత్తానికి  సుప్రీమ్ కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పీ కి జలక్ ఇచ్చింది. ఇదిలా ఉండగా తమ ఎం.ఎల్.ఏ లను కాపాడుకోవడం కోసం బస్సులో హైద్రాబాదుకు తరలించిన కాంగ్రెస్, జె.డి.ఎస్, వాళ్ళు ఇలా అడుగు పెట్టి పెట్టగానే ఈ తీర్పు రావడంతో మళ్ళీ తిరుగు ప్రయాణానికి సన్నద్ధం కావాల్సివచ్చింది. భళా... సుప్రీం... భళా... 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: భళా... సుప్రీం... భళా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top