Translate

  • Latest News

    17, మే 2018, గురువారం

    భలే చాన్సులే...


    భలే చాన్సులే... లక్కీ చాన్సులే... భల్... భలే భల్... భలే... లక్కీ చాన్సులే... కర్ణాటక లో గోడ దూకే ఎం.ఎల్.ఏ లకు ఒక్కొక్కరికి 100 కోట్లంట... ఇంకేం కావాలి... నైతిక విలువలను కాసేపు తీసి పక్కన పెడితే తరతరాలకు సరిపడా డబ్బు... విలువల దేముంది... కొన్నాళ్ళు పోయాక నేను అప్పుడు చాలా పెద్ద తప్పు చేశాను... క్షమించండి... అని ప్రజలకు ఒక అప్పీల్ చేస్తే సరి... ఇప్పుడు కుమారస్వామి చెప్పలా... నేను అప్పుడు బి.జె.పీ కి సపోర్ట్ చేసి తప్పు చేశాను... మా నాన్నకు మచ్చ తెచ్చాను... అని. ఇప్పుడు అందరూ కుమారస్వామి శభాష్ అంటున్నారుగా... నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష... అని జె.డి.ఎస్ ఎం.ఎల్.ఏ లు గాని. లేదా కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ లు గాని ఓ 8 మంది తోక జాడిస్తే చాలు యడ్యూరప్పకు ఇక తిరుగులేదు. ఎలాగో గవర్నర్ సార్.. 15 రోజులు టైమ్ ఇచ్చారు... ఓ 800 కోట్లు విసిరేస్తే 8 మంది దొరకడం పెద్ద సమస్య కాదు.... ఏ మాటకా మాట చెప్పుకోవాలి... అప్పుడు 2008 లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా... అత్యధిక స్థానాలు గెలుచుకున్నా, కుమారస్వామి బి.జె.పీ తో చేతులు కలపడంతో... గవర్నర్ బి.జె.పీ, జె.డి.ఎస్ కు అవకాశము ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ రోదన వినిపించుకునే నాధుడు లేదు... ఇప్పుడు సీన్ తిరగబడింది. ఇప్పుడూ కాంగ్రెస్ కు మొండిచేయే. ఎప్పటికెయ్యది... ప్రస్తుతమో... అప్పటికయ్యది... అన్నట్టుగా... గవర్నర్ లు కూడా... కేంద్ర పాలకుల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు... మరి వారికా పదవి పైవారి పుణ్యమే కదా... ఋణం తీర్చుకునే ఛాన్స్ వచ్చినపుడు వారు మాత్రం వదులుకుంటారా... ఇక్కడ ఎవరిదీ తప్పు లేదు... వారి వారి యాంగిల్స్ లో ఎవరికి వారిదే కరెక్ట్... ఈ రాజకీయ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తు వేసి ప్రత్యర్థులను చిత్తు చేసి... ఎదుటి వారిని అష్టదిగ్బంధనం చేసి ఆట కట్టించినవాడే మొనగాడు... చూద్దాం... కర్ణాటక రాజకీయ తెరపై ఈ రెండు వారాలలో ఇంకెన్ని చిత్ర,విచిత్రాలు జరుగుతాయో... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: భలే చాన్సులే... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top