Translate

  • Latest News

    16, మే 2018, బుధవారం

    లౌకిక పార్టీల ఐక్య‌త‌ను చాటిచెప్పిన క‌ర్నాట‌క ఎన్నిక‌లు


    క ర్నాట‌క ఎన్నిక‌లు భవిష్య‌త్తుకు ఒక సంకేతం ఇచ్చాయి. బీజేపీ లాంటి మ‌తత‌త్వ శ‌క్తుల‌ను ఎదుర్కొనే క్ర‌మంలో అనుస‌రించాల్సిన వ్యూహాన్ని గుర్తుచేశాయి. ఈ సంద‌ర్బంగా ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సైతం ఇదే ర‌క‌మైన అభిప్రాయాన్ని వినిపించారు. క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, జేడీఎస్ క‌లిసి పోటీ చేసి ఉంటే బీజేపీ వ్య‌తిరేక ఓటు చెల్లాచెదురు కాకుండా ఉండేద‌న్న అభిప్రాయాన్ని బీజేపీ వ్య‌తిరేక పార్టీలు ఇప్పుడు స్వాగ‌తిస్తున్నాయి.
    శ‌భాష్ కుమార‌స్వామి ... 

    క‌ర్ణాట‌క ఓటింగ్ స‌ర‌ళి ప‌రిశీలిస్తే బీజేపీకి వ్య‌తిరేకంగా ముస్లింమైనార్టీలు, ఎస్సీ,ఎస్టీలు కాంగ్రెస్‌, జేడీఎస్‌కు ఓటువేసార‌న్న‌ది సుస్ప‌ష్ట‌మౌతుంది. విచిత్ర‌మేమిటంటే అత్య‌దిక మంది ఓటర్లు కాంగ్రెస్‌, జేడీఎస్‌కు ఓటువేసినా అనూహ్యంగా బీజేపీ సీట్లు సాధించుకోగ‌లిగింది. తాజాగా జేడీఎస్‌లో చీలికలకు ఫుల్‌స్టాప్ పెట్టారు మాజీ ప్రధాని దేవెగౌడ కుమారులు. కలిసికట్టుగా ప్రెస్ మీట్ పెట్టి తామంతా ఒకటేనని ప్రకటించారు. కర్ణాటకలో సెక్యులర్ ఓట్లు చీలిపోయాయని.. అదే బీజేపీకి కలిసి వచ్చిందన్నారు. అంతేకాని ప్రధాని మోదీ గొప్పదనం ఏమీ లేదన్నారు.. లౌకిక ఓట్లు చీలిపోవడంతోనే బీజేపీకి అధిక సీట్లు వచ్చాయన్నారు. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతోనే కాంగ్రెస్‌తో కలవాల్సి వచ్చిందని తెలిపారు.2004-2005లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తన తండ్రి దేవెగౌడకు మచ్చ తెచ్చానని, ఈసారి అలా జరగకూడదనే ఉద్దేశంతోనే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ మచ్చను చెరిపివేసేందుకు నిర్ణయించుకున్నట్లు కుమారస్వామి తెలిపారు.
    రానున్న ఎన్నిక‌ల్లో ఇదే ఫార్ములా... 
    బీజేపీ వ్యూహాన్ని ధీటుగా తిప్ప‌గొ్ట్టేందుకు క‌ర్నాట‌క ఒక గుణ‌పాఠంగా బావిస్తున్నారు. మ‌తత‌త్వ పార్టీల‌ను ఎదుర్కొవ‌టానికి అనుస‌రించాల్సిన వ్యూహాన్ని ఈ ఎన్నిక‌లు లౌకిక పార్టీల‌కు అందించాయ‌ని చెబుతున్నారు. రానున్న ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ లౌకిక పార్టీల ఐక్య‌త‌ను సాధించేదిశ‌గా అడుగులు వేయ‌టానికి క‌ర్నాట‌క ఎన్నిక‌లు స్పూర్తిగా నిలిచాయి.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: లౌకిక పార్టీల ఐక్య‌త‌ను చాటిచెప్పిన క‌ర్నాట‌క ఎన్నిక‌లు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top