Translate

  • Latest News

    15, మే 2018, మంగళవారం

    క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓట‌మి ...


    ఎగ్జిట్‌పోల్ అంచ‌నాల‌కు భిన్నంగా క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారం చేప‌ట్ట‌డానికి సిద్దమైంది. అధికారం చేప‌ట్ట‌డానికి అవ‌స‌మైన మ్యాజిక్ ఫిగ‌ర్‌ను బీజేపీ సాధించింది. క‌ర్నాట‌క ఎన్నిక‌లు దేశంలో కీల‌కంగా మారాయి. రానున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ఇవి సెమిఫెన‌ల్స్‌గా భావించ‌టంతో కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌తిష్ట‌గా భావించాయి. ద‌క్షిణాదిన ఖాతా తెర‌వ‌టానికి బీజేపీ సైతం త‌న స‌ర్వ‌శ‌క్తులు వ‌డ్డింది. ఇదంతా ఒక ఎత్తైతే ఈ ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించి తెలుగువారికి జ‌రిగిన అన్యాయానికి బ‌దులు తీర్చుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇందుకు త‌గ్గ‌ట్లే టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగ సంఘాలనేత అశోక్‌కుమార్ క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో ప్ర‌చారం నిర్వ‌హించారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం రాష్ట్రానికి మోసం చేసింద‌ని , క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ ప‌రాభ‌వంతో రాష్ట్రానికి ప్ర‌త్యేక విష‌యంలో పునరాలోచించ‌వ‌చ్చ‌ని టిడిపి నేత‌లు భావించారు. కొంద‌రైతే ఇంకాస్త ముందుకు వెళ్లి తిరిగి టిడిపి , బీజేపీ సంబంధాలు బ‌ల‌ప‌డ‌టాయ‌ని అని కూడా చెప్పుకొచ్చారు. కాని అనూహ్యంగా బీజేపీ విజ‌యం టిడిపి శ్రేణుల్లో నిరాశను క‌లిగించింది. 
    క‌ర్నాట‌క‌లో బీజేపీ విజ‌యం , ఏపీ చంద్ర‌బాబు ప‌రాజ‌యంగా ప‌లువురు భావిస్తున్నారు. క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో టిడిపి ప్ర‌భావం ఎక్క‌డా క‌నిపించిన దాఖ‌లాలు కాన‌రాలేదు. స్థానిక ప్ర‌జ‌లు టిడిపి నాయ‌కుల ప్ర‌చారాన్ని ప‌ట్టించుకోలేదు. మ‌రోవైపు కొంత‌మంది ప్ర‌త్యేక హోదా విష‌యంలో నాలుగు సంవ‌త్స‌రాలు ఎందుకు దాగుడు మూత‌లు ఆడార‌ని టిడిపి నేత‌ల‌ను నిల‌దీశారు. ఇదిలా ఉంటే ఉద్యోగ‌సంఘాల నేత అశోక్‌బాబు క‌ర్నాట‌క వెళ్లి ఎన్నిక‌ల ప్రచారం పాల్గొన‌టం వివాద‌స్పదంగా మారింది. మ‌రోవైపు బీజేపీ నేత‌లు ముందునుంచి చెబుతున్న ప్ర‌కారం ఎన్నిక‌ల అనంత‌రం చ‌ర్య‌లు ఉంటాయ‌ని , ఇది చంద్ర‌బాబుకు ప్రాణ‌సంక‌టంగా మారే అవ‌కాశం ఉంద‌ని టిడిపి నేత‌లు భ‌య‌ప‌డుతున్నారు.మొత్తం మీద క‌ర్నాట‌క‌లో బీజేపీ విజ‌యం రాష్ట్రంలో చంద్ర‌బాబు ప‌రాజ‌యంగా భావిస్తున్నారు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓట‌మి ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top