Translate

  • Latest News

    13, జూన్ 2018, బుధవారం

    కర్ణాటకలో 1.28 లక్షల ముస్లిం ఓట్లు తొలగించారా..?


    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నిర్వహించిన టి.డి.పీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు  మాట్లాడుతూ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డేటా బేస్ ఇన్ డెవలప్మెంట్ పాలసీ అనే స్వచ్చంద సంస్థ  కర్ణాటకలో 18 లక్షల ముస్లిం ఓట్లు మాయం కావడంపై అధ్యయనం చేసిందని, ఈ అధ్యయనంలో  మొత్తం 1.28 లక్షల ముస్లిం ఓట్లను (అంటే దాదాపు 15 శాతం) ఓటర్ల జాబితా నుంచి తొలగించారని తెలిసిందని, ఈ విషయం జాతీయ మీడియా లో వచ్చిందని చెప్పారు. దీనిపై చంద్రబాబు ప్రతిస్పందిస్తూ బి.జె.పీ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తుందని, ఈ.వీ.ఎం లను కూడా మేనేజి చేసే ప్రమాదం కూడా ఉందని, పార్టీ కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏం చేస్తారు పాపం... మేనేజిమెంట్ లో ఈ ప్రపంచంలో చంద్రబాబు ను మించినోడు మరెవ్వరు లేరనుకుంటే... తాడి దన్నే  వాడి తలా దన్నే వాడొకడుంటాడని మోడీ పుట్టుకొచ్చాడు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవని సామెత   ఉందిగా... వీళ్లు ఇద్దరూ ఎన్నికలముందు ఎవరి స్వార్ధం కోసం వారు ఒకటయ్యారు. ఎన్నికలు అవగానే మోడీ చంద్రబాబును పూచిక పుల్లలా తీసిపారేసాడు. రాజకీయ పరమపద సోపాన పటం లో చాయ్ వాలా స్థాయి నుంచి చంద్రబాబు లాంటి వాళ్ళను ఎంతో మందిని కరివేపాకులా వాడుకుని వదిలేసి  ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన మోడీ అందరి లాగానే చంద్రబాబుకు సైతం హ్యాండిచ్చాడు. కాకపొతే సహజంగా... అదే పని చేసే చంద్రబాబుకు ... అచ్చం తన లాంటి వాడు... తన కన్నా రెండు ఆకులు ఎక్కువ తిన్న వాడు తగిలేసరికి దిమ్మ దిరిగిపోయింది. సరే వీళ్ళిద్దరూ ఎలా తగలడితే మనకెందుకు గాని కర్ణాటకలో 1.28 లక్షల ముస్లిం ఓట్లు తొలగించారన్న విషయంపై సీరియస్ గా ఆలోచించాలి. దీనిపై ప్రజా సంఘాలు విచారణకు డిమాండ్ చేయాల్సిన అవసరం ఎంతయైనా ఉంది.  

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కర్ణాటకలో 1.28 లక్షల ముస్లిం ఓట్లు తొలగించారా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top