Translate

  • Latest News

    15, జూన్ 2018, శుక్రవారం

    సం'కుల'సమరం....



    రాజ‌కీయాల‌లో కులం కార్డు లేకుండా ఊహించ‌ట‌మే క‌ష్టం.బ‌య‌ట‌కు మాత్రం కులం ,మ‌తం ,వ‌ర్గం ముద్ర లేకుండా అన్ని వ‌ర్గాల‌కు స‌మ‌న్యాయం చేస్తామ‌ని చెప్పుకున్నా ఏ పార్టీకి ఆ పార్టీ కుల‌,మ‌త ప్రాతిప‌దిక‌నే న‌డుస్తుంది అన్న‌ది వాస్త‌వం. ఎన్నిక‌ల స‌మయంలో ఈ వ్య‌వ‌హారం మ‌రీ శృతిమించుతోంది. ఇందుకు క‌మ్యునిస్టు పార్టీలు, ఉద్య‌మ‌పార్టీలు  సైతం అతీతంకాద‌ని ప‌లు సంఘ‌ట‌న‌లు రుజువు చేస్తున్నాయి. రాజ‌కీయ పార్టీలు త‌మ ఎన్నిక‌ల మానిఫ్యాస్టోలో సైతం ఆయా కులాల‌కు తాము చేసే ప‌నుల‌కు సంబందించిన వివ‌రాలు పొందుప‌రుస్తుంటారు.ఎవ‌రు ఎక్కువ‌గా కులాల‌ను వాడుకున్నారో వారి విజ‌యం న‌ల్లెరుపై న‌డ‌క అని భావిస్తుంటారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో సీట్ల కేటాయింపు, మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ స‌మ‌యంలోనూ కుల‌,మ‌త ప్రాధాన్య‌త ఉంటుంది. ఈ విష‌యంలో గ‌తంలో కాంగ్రెస్ పార్టీ ఆరీ తేరితే ,రాష్ట్రంలో మాత్రం టిడిపి అధినేత చంద్ర‌బాబు కుల,మ‌తాల‌ను వాడుకోవ‌టంలోనూ, వారి ఓట్లు వేయించుకోవ‌టంలోనూ ముందంజ‌లోనే ఉన్నారు. జ‌గ‌న్ ఈ విష‌యాన్ని గుర్తించిన‌ట్లున్నాయి. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లో ఆయా కులాల‌కు సంబందించి స‌మావేశాలు ఏర్పాటు చేయ‌టం, వారికి ప‌ద‌వులు, కార్పోరేష‌న్లు ఏర్పాటు చేస్తాన‌ని హామీలు ఇస్తున్నారు.


    అయితే రానున్న ఎన్నిక‌ల్లో ఏ కులం, ఏమ‌తం వారు ఎవ‌రికి ఓటేస్తారు. ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఏవ‌ర్గం వారి ఓట్లు ఎక్కువ ఉన్నాయ‌న్నఅంశాల‌పై అన్ని పార్టీలు దృష్టి కేంద్రిక రించాయి. అయితే ఎన్నిక‌ల్లో కులం, మ‌తం వాడుకోవ‌టం అంటే పులిమీద స్వారీ చేసిన‌ట్లే అని ఇప్ప‌టికే చంద్ర‌బాబుకు అర్ధ‌మై ఉండాలి. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇచ్చిన హామీలు , ప్ర‌స్తుతం వివిధ వ‌ర్గాల ప‌ట్ల అనుస‌రిస్తున్న తీరు కొన్ని స‌మాజిక‌వ‌ర్గాల ఓట్ల‌ను ఆయ‌న దూరం చేసుకున్న‌ట్లే అని ప్ర‌భుత్వ నిఘా వ‌ర్గాలు సైతం నివేదిక ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఎస్సీల వ‌ర్గీక‌ర‌ణ‌, కొన్ని కులాల‌ను ఎస్టీల‌లో చేర్చ‌టం, కాపుల‌ను బీసీల‌ను చేర్చ‌టం త‌దిత‌ర విష‌యాలు చంద్ర‌బాబును ఆయా వ‌ర్గాలు దూరం జ‌రిగిలా చేశాయి.

    దీంతో పాటు బ్రాహ్మ‌ణ‌వ‌ర్గాలు కూడా చంద్ర‌బాబుకు దూరంగా జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబు ఆయా సామాజిక వ‌ర్గాల ఓట్ల‌ను కొల్ల‌గొడ‌టానికి ఏఏ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తారో... ఏ వ్యూహం ప‌న్నుతారో అన్న అంశం ఆస‌క్తి నెల‌కొని ఉంది. మ‌రోవైపు టిడిపీలో ఉన్న బీసీలు, ముస్లింల‌కు ప్రాధాన్య‌త లేకుండా పోయింద‌ని గ‌తం నుంచి విమ‌ర్శ‌లు ఉన్నాయి. కులాల విష‌యంలో నెల‌కొన్న సందిగ్ధ‌త‌ను, చంద్ర‌బాబు వైఫ‌ల్యాల‌ను జ‌గ‌న్ క్యాష్ చేసుకుంటారా...అన్న‌ది కూడా ప్ర‌స్తుత ప్ర‌శ్న‌. మొత్తం మీద రానున్న ఎన్నిక‌ల్లో గ‌తం మాదిరి కాకుండా కులాలు,మ‌తాల ప్రాధాన్య‌త పెరిగింద‌న్న‌ది మాత్రం వాస్త‌వం..

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సం'కుల'సమరం.... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top